బిజినెస్

ఆపిల్ డిమాండ్‌పై త్వరలో పరిశీలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 29: భారత్‌లో ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలంటే తమకు కొన్ని రాయితీలు ఇవ్వాలని అమెరికా ఐటి దిగ్గజ సంస్థ ఆపిల్ చేసిన డిమాండ్‌పై కేంద్ర ఆర్థిక, వాణిజ్య శాఖలతో పాటు మరికొన్ని ఇతర మంత్రిత్వ శాఖలకు చెందిన సీనియర్ అధికారుల గ్రూపు వచ్చే నెల ఆరంభంలో చర్చించనుంది. జనవరి మొదటి వారంలో జరుగుతుందని భావిస్తున్న ఈ సమావేశంలో కేంద్ర రెవెన్యూ, పర్యావరణ, అటవీ, సమాచార సాంకేతిక పరిజ్ఞాన శాఖలతో పాటు పారిశ్రామిక విధాన అభివృద్ధి (డిఐపిపి) విభాగానికి చెందిన పలువురు సీనియర్ అధికారులు పాల్గొనబోతున్నారని అధికార వర్గాలు వెల్లడించాయి. భారత్‌లో ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు పన్నుల విషయంలో పలు రాయితీలతో పాటు ఇతర ప్రోత్సాహకాలను అందజేయాలని క్యూపర్టినో కేంద్రంగా పనిచేస్తున్న ఆపిల్ సంస్థ కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన విషయం తెలిసిందే. అయితే ఆపిల్ సంస్థ అదనంగా ఎటువంటి తోడ్పాటును కోరకుడా భారత్‌లో ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ‘అనేక సంస్థలు భారత్‌లో మొబైల్ ఫోన్లను తయారు చేస్తున్నాయి. వీటిలో ఏవీ అదనపు రాయితీలను కోరడం లేదు. దేశంలో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి రంగానికి ఊతమిస్తున్న ప్రభుత్వం ఈ సంస్థలన్నింటికీ తగినంత తోడ్పాటును అందజేస్తోంది’ అని ఆ వర్గాలు తెలిపాయి.