బిజినెస్

మోరి తరలివచ్చిన కార్పొరేట్ ప్రతినిధులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమలాపురం, డిసెంబర్ 29: దేశంలోనే తొలి డిజిటల్ గ్రామాలుగా రూపుదిద్దుకున్న తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం మోరి, మోరిపాడు గ్రామాలకు గురువారం తరలివచ్చిన ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పలు కార్పొరేట్ సంస్థల ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమావేశమయ్యారు. మోరి గ్రామానికి చెందిన బర్కీలీ యూనివర్సీటీ ప్రొఫెసర్ సాల్మన్ డార్విన్ నేతృత్వంలో ఐబియం, టెక్ మహీంద్ర, గూగుల్, ఎడీక్షన్, కొనికా, నాసా, శిస్కో, ఎగ్రీకావ్, హీరో, ఎపి ఫైబర్ నెట్, కేర్ హాస్పటల్స్, లూమెక్స్, బ్లూకేర్, స్టోర్‌కింగ్, టైకో, టీచ్ ఇండియా తదితర కార్పొరేట్ సంస్థల ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. సుమారు గంట 40 నిమిషాల పాటు వివిధ అంశాలపై వారితో చర్చించారు. అనంతరం రివర్‌సైడ్ స్కూల్ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన కార్పొరేట్ సంస్థల స్టాల్స్‌ను ముఖ్యమంత్రి పరిశీలించారు. మోరిలో ఫైబర్ గ్రిడ్ సేవలు ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు డిజిటల్ సేవలకు సంబంధించి పలు అంశాలను స్వయంగా పరిశీలించారు. మోరి జడ్పీ హైస్కూలులో డిజిటల్ తరగతులను ముఖ్యమంత్రి ప్రారంభించారు.