బిజినెస్

రహస్య పత్రాలన్నీ అప్పగించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 29: మాజీ చైర్మన్ సైరస్ మిస్ర్తి తమ సంస్థకు సంబంధించిన గోప్యతా నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని టాటా సన్స్ ఆరోపించింది. తమ సంస్థ నుంచి పదవీచ్యుతుడైన సైరస్ మిస్ర్తి తక్షణమే అన్ని రహస్య పత్రాలను తిరిగి తమకు అప్పగించడంతో పాటు భవిష్యత్తులో ఎటువంటి రహస్య సమాచారాన్ని బహిర్గతం చేయబోనని పేర్కొంటూ 48 గంటల్లోగా ఒప్పందంపై సంతకం చేయాలని టాటా సన్స్ డిమాండ్ చేసింది. ఈ మేరకు టాటా సన్స్ గురువారం ఆయనకు మరోసారి లీగల్ నోటీసు పంపింది. మిస్ర్తికి టాటా సన్స్ లీగల్ నోటీసు జారీ చేయడం గత మూడు రోజుల్లో ఇది రెండోసారి. సైరస్ మిస్ర్తి దురుద్దేశంతో ఎటువంటి అనుమతి లేకుండా తమ సంస్థ నుంచి రహస్య పత్రాలను బయటికి తీసుకెళ్లారని టాటా సన్స్ ఆరోపిస్తూ, ఈ పత్రాలన్నింటినీ తక్షణమే తిరిగి తమకు అప్పగించాలని ఆ నోటీసులో డిమాండ్ చేసింది.