బిజినెస్

అంతా బాగుంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 29: పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయంతో సత్ఫలితాలు రావటం ప్రారంభమైందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. దేశవ్యాప్తంగా ప్రత్యక్ష, పరోక్ష పన్నుల వసూళ్ళు బాగా పెరిగాయని, ఆర్థిక వ్యవస్థ బాగా పుంజుకుంటోందని గురువారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. నోట్ల రద్దుతో ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నం అవుతుందంటూ ప్రతిపక్షాలు వేసిన అంచనాలన్నీ తలకిందులయ్యాయని జైట్లీ అన్నారు. బ్యాంకింగ్ వ్యవస్థలోకి నగదు పెద్దఎత్తున వచ్చి చేరిందని, దీంతో బ్యాంకుల రుణ మంజూరు సామర్థ్యం బాగా పెరిగిందని ఆయన చెప్పారు. దీని పర్యవసానంగా పన్ను వసూళ్లు కూడా పెరిగాయని ఆర్థిక మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. ‘ఈనెల 19వరకు ప్రత్యక్ష పన్నుల్లో ఆదాయపు పన్ను 14.4 శాతం పెరిగింది, రిఫండ్‌ను దృష్టిలో పెట్టుకున్నా పెరుగుదల 13.7 శాతం ఉంది’ అని మంత్రి చెప్పారు. నవంబర్ 30 వరకు పరోక్ష పన్నుల్లో గణనీయమైన వృద్ధి సాధించినట్టు జైట్లీ తెలిపారు. కేంద్రానికి సంబంధించిన పరోక్ష పన్నులు 26.2 శాతం పెరిగాయన్నారు. ఎక్సైజ్ పన్ను 43.5 శాతం, సేవల పన్నులు 25.7 శాతం, కస్టమ్స్ పన్ను 5.6 శాతం పెరిగిందని మంత్రి వివరించారు. 2015 నవంబర్‌తో పోలిస్తే 2016 నవంబర్‌లో పరోక్ష పన్నుల వసూళ్లు పెరిగాయని ఆయన తెలిపారు. పెద్దనోట్ల రద్దు వల్ల వ్యవసాయ రంగంపై ప్రతికూల ప్రభావం పడుతుందని అందరూ ఆందోళన చెందారని అవన్నీ పటాపంచలయ్యాయని ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. రబీలో వరి నాట్లు గత సంవత్సరంలో పోలిస్తే 6.3 అధికంగా వేశారని తెలిపారు. బీమా వ్యాపారం, అంతర్జాతీయ పర్యటన, విమాన ప్రయాణం, పెట్రోలియం వినియోగం పెరిగిందన్నారు. మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడి 11 శాతం పెరిగిందన్నారు. పెద్దనోట్ల రద్దు వల్ల కొన్ని రంగాలపై ప్రతికూల ప్రభావం పడి ఉండవచ్చు కానీ, విమర్శకులు అంచనా వేసిన రీతిలో ఆర్థిక వ్యవస్థ ఎక్కడా దెబ్బతినలేదని జైట్లీ వెల్లడించారు. ఇంతకాలం రహస్యంగా ఉండిపోయిన నగదు బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చిందన్నారు. రిజర్వు బ్యాంకు వద్ద కావలసినంత కొత్త నగదు ఉందన్న మంత్రి, మార్కెట్ డిమాండ్ మేరకు కొత్త నోట్లను విడుదల చేస్తామన్నారు.
డిజిటల్ నగదు లావాదేవీలు బాగా పెరగాలన్నది ఎన్‌డిఏ ప్రభుత్వం లక్ష్యమని ఆర్థిక మంత్రి వెల్లడించారు. డిసెంబర్ 31 తరువాత నగదుపై విధించిన పరిమితులను తొలగిస్తారా? అని ఒక విలేఖరి ప్రశ్నించగా ఆర్‌బిఐ ఇందుకు సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటోందన్నారు.

చిత్రం..ఆర్థిక శాఖ కార్యాలయంలో గురువారం విలేఖరులతో మాట్లాడుతున్న అరుణ్ జైట్లీ