బిజినెస్

ఆర్థిక స్వరూపమే మారిపోతుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 29: వస్తు సేవల పన్ను(జిఎస్‌టి), పెద్ద నోట్ల రద్దు దేశ ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులనే పూర్తిగా మార్చివేయగలవని రిజర్వ్ బ్యాంక్ అభిప్రాయ పడింది. నోట్లరద్దు నిర్ణయం ప్రజలకు తాత్కాలికంగా ఇబ్బందులు కలగజేసినప్పటికీ, అలాగే వృద్ధి రేటుపై ఆ క్షణానికి ప్రతికూల ప్రభావం చూపించినప్పటికీ అది దేశ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా మార్చి వేయగలదని ఆర్‌బిఐ పేర్కొంది. కాగా బ్యాంకుల నిరర్థక ఆస్తులు పెరిగిపోవడం వల్ల రిస్క్‌లు మరింతగా పెరుగుతాయని ఆభిప్రాయ పడింది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో కార్పొరేట్ రంగం పని తీరు మెరుగుపడినప్పటికీ టర్నోవర్ తక్కువగా ఉండడం అలాగే కొనసాగుతోందని అభిప్రాయ పడింది.
దేశవ్యాప్తంగా వస్తు సేవల పన్ను(జిఎస్‌టి)కి మారడం, అలాగే వెయ్యి, 500 రూపాయల నోట్లను రద్దు చేయడం లాంటి చర్యలు తాత్కాలికంగా ప్రజలకు ఇబ్బందులు కలగజేసినప్పటికీ, వృద్ధి రేటుపై కొంతకాలం ప్రతికూల ప్రభావం చూపించినప్పటికీ అవి దేశ ఆర్థిక వ్యవస్థను సమూలంగా మార్చివేయగలిగిన నిర్ణయాలని ఆర్‌బిఐ తన ఆర్థిక సుస్థిరత నివేదిక (ఎఫ్‌ఎస్‌ఆర్) 14వ సంచికలో వ్యాఖ్యానించింది. కాగా, 500, వెయ్యి రూపాయల నోట్ల రద్దు నిర్ణయం భవిష్యత్తులో విప్లవాత్మక మార్పులకు కారణమవుతుందని ఈ నివేదిక ముందుమాటలో ఆర్‌బిఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ అభిప్రాయ పడ్డారు. దేశ ఆర్థిక వ్యవస్థకు చెందిన కొన్ని రంగాల్లో స్వల్పకాలిక కుదుపులకు కారణమైనప్పటికీ, ప్రజలకు ఇబ్బందులు కలిగినప్పటికీ డిజిటల్ తరహా పేమెంట్లకు మళ్లడం పెరగడంతో సామర్థ్యం పెరగడం, పారదర్శకత, జవాబుదారీతనం కారణంగా రాబోయే రోజుల్లో దేశ ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులు పూర్తిగా మారిపోతాయని ఆయన అన్నారు. అయితే నిర్లక్ష్యానికి ఎలాంటి అవకాశం ఇవ్వకూడదని ఆయన హెచ్చరిస్తూ ఫైనాన్షియల్ మార్కెట్లలో తలెత్తే ఆటుపోట్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఉర్జిత్ పటేల్ అన్నారు.
బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన రిస్క్‌లు ఇప్పటికీ అలాగ కొనసాగుతున్నాయని, వాటి ఆస్తుల నాణ్యత దిగజారడంతో పాటుగా లాభదాయకత, లిక్విడిటీ కూడా తక్కువగా ఉన్నాయని ఆర్‌బిఐ పేర్కొంది. బ్యాంకుల్లో వ్యాపార వృద్ధి చాలా మందకొడిగా ఉందని, ప్రైవేట్ బ్యాంకులతో పోలిస్తే ప్రభుత్వ రంగ బ్యాంకులు వెనుకబడి ఉన్నాయని ఆర్‌బిఐ తెలిపింది. 2016 మార్చి-సెప్టెంబర్ మధ్య కాలంలో బ్యాంకుల ఆస్తుల నాణ్యత మరింతగా దిగజారిందని పేర్కొంది. బ్యాంకుల మొత్తం ఆస్తుల్లో స్థూల నిరర్థక ఆస్తుల నిష్పత్తి(జిఎన్‌పిఏ) 2016 మార్చిలో 7.8 శాతం ఉండగా సెప్టెంబర్ నాటికి అది 9.1 శాతానికి పెరిగిందని పేర్కొంది. బ్యాంకులు, ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు గగణనీయమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నప్పటికీ మొత్తంమీద దేశ ఆర్థిక వ్యవస్థ స్థిరంగానే ఉందని ఆ నివేదిక అభిప్రాయ పడింది. కాగా, నోట్ల రద్దు కారణంగా దెబ్బతిన్న చిన్న, మధ్య తరహా పరిశ్రమల రంగానికి వర్కింగ్ క్యాపిటల్‌ను పెంచాలని రిజర్వ్ బ్యాంక్ దేశంలోని బ్యాంకులకు సూచించింది.