బిజినెస్

ద్వంద్వ పన్నుల రద్దుపై సింగపూర్‌తో తాజా ఒప్పందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 30: ద్వంద్వ పన్నులకు సంబంధించి ఇప్పటికే కుదుర్చుకున్న ఒప్పందాలను సవరించి ఈ ఏడాది మారిషస్, సైప్రస్‌తో కొత్త ఒప్పందాలను కుదుర్చుకున్న భారత్.. శుక్రవారం తాజాగా సింగపూర్‌తోనూ అలాంటి ఒప్పందమే కుదుర్చుకుంది. భారత్‌లో సింగపూర్ హైకమిషనర్ లిమ్ తువాన్ కువాన్, కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు చైర్మన్ సుశీల్ చంద్ర ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడుతూ పాత పెద్ద నోట్ల రద్దు తర్వాత తలెత్తిన కరెన్సీ కొరత చాలావరకు తీరిపోయిందని, పరిస్థితి కుదుట పడుతోందని చెప్పారు. అయితే రద్దయిన నోట్ల మార్పిడికి ఇచ్చిన 50 రోజుల గడువు ముగిసినందున బ్యాంకులు, ఎటిఎంల ద్వారా విత్‌డ్రాలకు సంబంధించి విధించిన పరిమితులను ఎత్తివేసే విషయమై ఆయన ఎలాంటి సంకేతాలు ఇవ్వకపోవడం గమనార్హం.