బిజినెస్

రద్దయిన నోట్ల డిపాజిట్ వివరాలివ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 30: రద్దయిన పాత పెద్ద నోట్ల డిపాజిట్లకు సంబంధించిన మొత్తం వివరాలను తక్షణం తమకు తెలియజేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బిఐ) దేశంలోని అన్ని బ్యాంకులను ఆదేశించింది. రద్దయిన వెయ్యి, 500 రూపాయల నోట్ల మార్పిడికి గడువు డిసెంబర్ 30(శుక్రవారం)తో ముగియడంతో సాయంత్రం బ్యాంకింగ్ పని గంటలు ముగిసిన వెంటనే తమ వద్ద ఉన్న రద్దయిన నోట్ల వివరాలను ఇ-మెయిల్ ద్వారా తెలియజేయాలని ఆర్‌బిఐ ఒక నోటిఫికేషన్‌లో బ్యాంకులను కోరింది. రద్దయిన నోట్ల డిపాజిట్లకు సంబంధించిన సమాచారాన్ని సేకరించడం కోసం జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు (డిడిసిబి) తప్ప ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు, గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకులు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని కూడా ఆదేశించింది. అంతేగాకుండా తమ వద్ద ఉన్న రద్దయిన పాత పెద్ద నోట్లను బ్యాంకులు శనివారం (డిసెంబర్ 31)లోగా రిజర్వ్ బ్యాంక్‌కు చెందిన ఏదయినా ఇష్యూ కార్యాలయంలో కానీ లేదా కరెన్సీ చెస్ట్‌లో కానీ డిపాజిట్ చేయాలని కూడా స్పష్టం చేసింది. అంతేకాదు, 2016, డిసెంబర్ 31నుంచి బ్యాంక్ నగదు నిల్వల్లో రద్దయిన నోట్లు భాగం కాబోవని కూడా స్పష్టం చేసింది.
డిసిసిబిలు నవంబర్ 10-14 మధ్య కాలంలో స్వీకరించిన రద్దయిన నోట్లను తదుపరి ఆదేశాలు జారీ అయ్యేంతవరకు అట్టిపెట్టుకోవచ్చని కూడా తెలిపింది. అలాగే లింక్ శాఖలు, లేదా బ్యాంకుల ఇతర శాఖలు, పోస్ట్ఫాస్‌ల నుంచి అందిన రద్దయిన నోట్ల నిల్వలను డిపాజిట్ చేయడానికి కరెన్సీ చెస్ట్ సదుపాయం కలిగిన బ్యాంకులు అదనపు ఏర్పాట్లు చేసుకోవాలని కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుక్రవారం ఆదేశించింది.