బిజినెస్

పదిహేను రోజుల్లో రూ. 3,285 కోట్లు లాగేశారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 1: పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో జన్-్ధన్ ఖాతాల్లో భారీగా నగదు డిపాజిట్లు జరిగినది తెలిసిందే. అయితే గత పదిహేను రోజుల్లో ఈ ఖాతాల్లో నుంచి 3,285 కోట్ల రూపాయల నగదు ఉపసంహరణలు జరగడం గమనార్హం. ఇక డిసెంబర్ 7తో ముగిసిన వారంలో జన్-్ధన్ ఖాతాల్లోకి రద్దయిన నోట్ల డిపాజిట్లు 74,610 కోట్ల రూపాయలుగా ఉంటే, నవంబర్ 8 నుంచి గడచిన 45 రోజుల నాటికి జన్-్ధన్ ఖాతాల్లో నగదు విలువ 87,160 కోట్ల రూపాయలకు చేరుకుంది. అయితే జన్-్ధన్ ఖాతాల్లో నవంబర్ 9 నాటికి ఉన్న నగదు నిల్వల విలువ 45,637 కోట్ల రూపాయలని, ఆ తర్వాత 45 రోజుల్లో 48 లక్షల ఖాతాల్లోకి మరో 41,523 కోట్ల రూపాయలు డిపాజిట్ అయ్యాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయ. అక్రమార్కులు తమ అవినీతి సంపదను మార్చుకోవడానికి జన్-్ధన్ ఖాతాలను వాడుకుంటున్నట్లు తెలియడంతో ప్రభుత్వం ఈ లావాదేవీలపై నిఘా పెట్టినది తెలిసిందే.