బిజినెస్

ఆర్థిక క్రమశిక్షణ అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: ఆర్థిక క్రమశిక్షణను పాటించాలని రాష్ట్రాలను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ కోరారు. వౌలిక రంగంతోపాటు అభివృద్ధి కార్యక్రమాలకు నిధులను వెచ్చించాలని, ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలను ఆధార్ అనుసంధానించి అందించాలని సూచించారు. సోమవారం ఇక్కడ రాష్ట్రాల ఆర్థిక కార్యదర్శులతో జరిగిన ద్వితీయ సదస్సులో జైట్లీ మాట్లాడుతూ 14వ ఆర్థిక సంఘం నివేదిక అమలు తర్వాత కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా గణనీయంగా పెరుగుతోందన్నారు. ఆ పెరుగుదల 10 శాతంగా ఉంటుందని, దీంతో కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా 42 శాతానికి చేరుతోందన్నారు. 13వ ఆర్థిక సంఘం హయాంలో రాష్ట్రాలు అందుకున్నదేంటో, ఇప్పుడు అందుకుంటున్నదెంటో తెలుస్తుందన్నారు. సామాజిక, వౌలిక రంగాలు, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వ దృష్టి పెట్టిందని, వాటికి భారీ నిధులను కేటాయిస్తున్నామన్నారు. కాబట్టి రాష్ట్రాలు కూడా ఇందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.