బిజినెస్

పరిశ్రమలకు భూముల కేటాయింపుల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 1: పరిశ్రమలకు భూముల కేటాయింపుల్లో ఎస్సీ, ఎస్టీలకు తెలంగాణ ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని తెలంగాణ పారిశ్రామిక, వౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ గ్యాదరి బాలమల్లు అన్నారు. ఇందులో భాగంగా టిఎస్‌ఐఐసి రిజర్వేషన్ల ప్రక్రియను పక్కాగా అమలు చేస్తోందన్నారు. ఎస్సీలకు 16 శాతం, ఎస్టీలకు 6 శాతం, మహిళలకు 10 శాతం భూములను కేటాయిస్తామన్నారు.
ప్రభుత్వం అందజేస్తున్న అన్ని రకాల ప్రోత్సాహకాలను, సబ్సిడీలను ఎస్సీ, ఎస్టీ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. దళిత్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (డిక్కీ) బృందం ఆయనను కలిసింది. ఈ సందర్భంగా బాలమల్లు మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో ఏపిఐఐసి 1980 నుంచి 2014 వరకు ఎస్సీ, ఎస్టీలకు 8,200 యూనిట్ల స్థాపనకు భూములు కేటాయించారన్నారు. అయతే తెలంగాణ అవతరించిన తర్వాత ఎస్సీ, ఎస్టీలకు 342 యూనిట్ల స్థాపనకు భూములు కేటాయించామన్నారు. కేవలం రెండేళ్ల కాలంలోనే రికార్డు స్ధాయిలో 62 మంది ఎస్సీలకు, 25 మంది ఎస్టీలకు, 21 మంది ఎస్సీ మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు, 31 మంది ఎస్టీ మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సబ్సిడీపై భూములను కేటాయించామన్నారు. కాగా, జీవో 61 ప్రకారం పాత, కొత్త పారిశ్రామిక వాడల్లో ఖాళీగా ఉన్న ఫ్లాట్లలో ఎస్సీలకు 18.2 శాతం, ఎస్టీలకు 6 శాతం కేటాయించనున్నట్లు ఆయన చెప్పారు.