బిజినెస్

‘ఎగుమతుల రంగంపై జిఎస్‌టి వేయొద్దు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 3: వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) నుంచి ఎగుమతుల రంగానికి మినహాయింపు ఇవ్వాలని జిఎస్‌టి మండలిని కోరింది కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ. అలాగే తోలు, సిమెంట్, ప్లాంటేషన్ వంటి కార్మిక ఆధారిత రంగాలపై పన్నును తక్కువగా విధించాలని విజ్ఞప్తి చేసింది. మంగళవారం జిఎస్‌టి కౌన్సిల్‌తో ఇక్కడ జరిగిన సమావేశం అనంతరం ఆ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ విలేఖరులతో మాట్లాడారు. ఐఫోన్ తయారీ సంస్థ, అమెరికాకు చెందిన యాపిల్‌కు భారత్‌లో ఉత్పాదక కేంద్రం ఏర్పాటుపై ఎలాంటి ప్రోత్సాహకాలు ఇవ్వడానికి సిద్ధంగా లేమన్నారు. ప్లాంట్ ఏర్పాటుకు ప్రోత్సాహకాలపై కేంద్రాన్ని కోరేందుకు యాపిల్ ప్రతినిధులు ఈ నెల భారత్‌కు వస్తున్నారు.