బిజినెస్

మూడో త్రైమాసికంలో తగ్గనున్న జిడిపి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 5: నోట్ల రద్దు తర్వాత ఉత్పాదక, సేవా రంగాల్లో వృద్ధి గణనీయంగా తగ్గిపోయిన కారణంగా అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో దేశ జిడిపి వృద్ధి ఇంతకు ముందు అంచనా వేసిన దానికన్నా చాలా తక్కువగా 5 శాతమే ఉండవచ్చని హెచ్‌ఎస్‌బిసి ఒక నివేదికలో అభిప్రాయ పడింది. అలాగే జనవరి-మార్చి త్రైమాసికంలో సైతం జిడిపి వృద్ధి 6 శాతమే ఉండవచ్చని, అది ఇంతకు ముందు అంచనా వేసినదానికన్నా 2 శాతం తక్కువ అని ఆ నివేదిక పేర్కొంది. అయితే మార్చి తర్వాత ఆర్థిక వృద్ధి తిరిగి మామూలు స్థాయికి చేరుకోవచ్చని క్రమేణా 7 శాతానికి చేరుకోవచ్చని కూడా ఆ నివేదిక పేర్కొంది.