బిజినెస్

భారత్ పరిస్థితి మెరుగ్గానే ఉంటుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 5: స్థూల ఆర్థిక పునాదులు మరింతగా మెరుగుపడ్డం కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా మెరుగుపడకపోయినప్పటికీ భారత్ పరిస్థితి మాత్రం మెరుగ్గానే ఉంటుందని నల్లధనం, పన్నుల ఎగవేతలాంటి వాటిని అంతమొందించడానికి తీసుకున్న చర్యలు స్థూల జాతీయ ఉత్పత్తి(జిడిపి)పై సానుకూల ప్రభావం చూపించే అవకాశముందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలోని ఆర్థిక సుస్థిరత, అభివృద్ధి మండలి (ఎఫ్‌ఎస్‌డిసి) అభిప్రాయ పడింది. గురువారం ఇక్కడ జరిగిన సమావేశంలో కౌన్సిల్ దేశ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న ప్రదాన సవాళ్లపై చర్చించింది. ‘ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికీ గందరగోళంగానే ఉంది. అయినప్పటికీ స్థూల ఆర్థిక మూలాలు మరింత మెరుగుపడిన దృష్ట్యా భారత్ పరిస్థితి మెరుగ్గానే ఉంటుంది’ అని సమావేశం అనంతరం జైట్లీ చెప్పారు. ఆర్థిక శాఖలోని అన్ని విభాగాలకు చెందిన అదికారులు రిజర్వ బ్యాంక్ గవర్నర్ ఉర్జిత్ పటేల్‌తో పాటుగా ఫైనాన్స మార్కెట్ రెగ్యులేటర్లు అందరు కూడా హాజరయిన ఈ సమావేశంలో బ్యాంకుల్లో నిరర్థక ఆస్తుల (ఎన్‌పిఏ) అంశాన్ని కూడా సమీక్షించింది. ‘స్థూల ఆర్థిక మూలాలు మెరుగుపడిన దృష్ట్యా భారత్ ఇప్పుడు మెరుగైన స్థితిలో ఉంది’ అని ఈ సమావేశం అభిప్రాయ పడినట్లు ఒక అధికారిక ప్రకటన తెలిపింది. నల్లధనాన్ని, పన్నుల ఎగవేతను అంతమొందించడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు జిడిపితో పాటుగా దీర్ఘకాలంలో ఆర్థిక సుస్థిరతపైన సానుకూల ప్రభావాన్ని చూపించనున్నాయని ఈ సమావేశం అభిప్రాయ పడినట్లు ఆ ప్రకటన తెలిపింది.
సమావేశంలోప్రభుత్వ ఆర్థిక ముఖ్య సలహాదారు అరవింద్ సుబ్రహ్మణ్యం దేశ ఆర్థిక పరిస్తితిపై ప్రజెంటేషన్ ఇచ్చారు. కాగా, రెగ్యులేటర్లు రాబోయే ఆర్థిక బడ్జెట్‌కు సంబందించి సూచనలు సలహాలుఇచ్చారని, వీటిపై కౌన్సిల్‌లో చర్చించడం జరిగిందని కూడా ఆ ప్రకటన తెలిపింది.

చిత్రం..ఎఫ్‌ఎస్‌డిసి సమావేశంలో పాల్గొన్న సెబి చైర్మన్ సిన్హా,
ఆర్‌బిఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ