బిజినెస్

ఎగుమతులకు ఊతమిచ్చేందుకు సమష్టి కృషి అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 5: స్థిరమైన ప్రాతిపదికపై దేశ ఎగుమతులకు ఊతమిచ్చేందుకు కృషి చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం మరింత పెరగాల్సిన అవసరం ఎంతో ఉందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఉద్ఘాటించారు. దిగుమతులపై పరిమితులు విధించడం ద్వారా గత జనవరి నుంచి మనం వాణిజ్య లోటును నియంత్రించుకోగలిగామని, దేశ ఎగుమతులకు ఊతమిచ్చేందుకు కలసికట్టుగా కృషి చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు మరింత సమన్వయంతో ముందుకు సాగుతూ తమ ప్రయత్నాలను రెట్టింపు చేయాల్సిన అవసరం ఉందని, అంతర్జాతీయంగా ప్రస్తుతం నెలకొన్న వాణిజ్య వాతావరణంలో ఇదే సరైన మార్గమని ఆమె అన్నారు. న్యూఢిల్లీలో గురువారం జరిగిన వాణిజ్య అభివృద్ధి, ప్రోత్సాహక మండలి సమావేశంలో ఆమె ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఈ మండలిలో సభ్యులుగా ఉన్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వాణిజ్య మంత్రులతో పాటు కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాలకు చెందిన 14 మంది కార్యదర్శులు, భారత ఎగుమతి సంస్థల సమాఖ్య సమాఖ్య (ఎఫ్‌ఐఇఓ) సహా వాణిజ్య, పారిశ్రామిక రంగాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అంతర్జాతీయ ఎగుమతులకు ఊతమివ్వాలన్న లక్ష్యంతో రాష్ట్రాల మధ్య భాగస్వామ్యాలను పెంపొందించాలన్నదే ఈ మండలి ఉద్దేశ్యమని ఆమె తెలిపారు.

చిత్రం..సమావేశంలో ప్రసంగిస్తున్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్