బిజినెస్

పెనుమార్పులు ఖాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 5: దేశ ఆర్ధిక వ్యవస్ధలో రానున్న రోజుల్లో పెనుమార్పులు రాబోతున్నాయని, ఆర్థిక రంగంలో డిజిటలైజేషన్ చెల్లింపుల విప్లవరం వస్తుందని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ డాక్టర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. నల్లధనం విధ్వంసానికి కేంద్రం అమలు చేసిన వినూత్న విచ్చిన్న విధానం పెద్ద నోట్ల రద్దు అని ఆయన అభివర్ణించారు. విచ్ఛిన్న సృజనాత్మక విధానంలో భాగంగా మొబైల్ ఫోన్లు, డిజిటల్ ఫోటో గ్రఫీ, ఆన్‌లైన్ రిటైలింగ్ పద్ధతులు వచ్చాయని, ఇవన్నీ అనూహ్యమైన మార్పులని, మార్కెట్లను పునర్నిర్మాణం చేశాయన్నారు. భారతదేశ ఆర్ధిక రంగంలో చెల్లింపుల విధానంలో మార్పులనే విచ్ఛిన్న సృజనాత్మకతగా భావించరాదన్నారు. పొదుపు, పరమతి, మైక్రో బీమా మార్కెట్లకు విచ్ఛిన్న సృజనాత్మకత విధానాలు విస్తరించాయన్నారు. గురువారం ఇక్కడ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డెవలప్‌మెంట్ అండ్ రీసెర్చి బ్యాంకింగ్ టెక్నాలజీ (ఐడిఆర్‌బిటి) డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్, నెట్‌వర్కింగ్‌పై ఏర్పాటు చేసిన 18వ సదస్సును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డిజిటలైజేషన్ విధానం భారత్‌లో శరవేగంగా వ్యాపిస్తోందన్నారు. ఎక్కువ నగదు ఆర్ధిక లావదేవీల నుంచి తక్కువ నగదు లావాదేవీలకు మారుతున్నామన్నారు. సాంకేతిక పరిజ్ఞానం, ఆర్ధిక ఇంజనీరింగ్‌తో కలిసి అమలు చేయడాన్ని విచ్ఛిన్న సృజనాత్మకత విధానమంటారని ఆయన చెప్పారు. సంప్రదాయ బ్యాంకులు టెక్నాలజీతో ఉరుకులు తీయాలని, ఇతర సంస్ధలతో ఒప్పందాలు కుదుర్చుకోవాలని ఆయన కోరారు. దేశంలో ఆర్ధిక సుస్ధిరత, వినియోగదారుల పరిరక్షణకు రెగ్యులేటర్లు అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. పెద్ద నోట్ల రద్దు అనేది 1991 ఆర్ధిక సంస్కరణల తర్వాత తీసుకున్న అతి పెద్ద నిర్ణయమన్నారు. కొత్త ఆర్ధిక విధానాల వల్ల మార్కెట్లు, వినియోగదారులు దెబ్బతినకుండా చూడాలని, మరో వైపు కొత్త పాలసీల వల్ల ప్రజలకు మేలు జరిగేటట్లు కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలన్నారు. తక్కువ ఆదాయం వచ్చే వర్గాలకు మైక్రో ఫైనాన్స్ వల్ల మంచి ప్రయోజనాలు చేకూరాయన్నారు. మైక్రోఫైనాన్స్ వల్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు మంచి మేలు చేకూరిందన్నారు. పెద్ద నోట్ల రద్దు వల్ల జరిగిన ప్రయోజనంపై చర్చలుకొనసాగుతుంటాయన్నారు. కాని దీని వల్ల దేశ ఆర్ధిక రంగానికి వచ్చే ప్రయోజనాలను చూడాలన్నారు.

చిత్రం..ఐడిఆర్‌బిటి సదస్సులో పాల్గొన్న రిజర్వు బ్యాంక్ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు