బిజినెస్

ఆర్‌బిఐ వడ్డీరేట్లు తగ్గకపోవచ్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 5: అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఫిబ్రవరిలో జరిపే ద్రవ్య పరపతి విధానం సమీక్షలో రెపో రేట్‌ను తగ్గించకపోవచ్చని, ద్రవ్యోల్బణం తక్కువ స్థాయిలో ఉంచడం కోసం కొత్త ఆర్థిక సంవత్సరంలో కూడా దాని వైఖరి అలాగే కొనసాగవచ్చని స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బిఐ) తన తాజా నివేదికలో అభిప్రాయ పడింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం తక్కువ స్థాయిలోనే ఉంటుందని కూడా ఆ నివేదిక పేర్కొంది. డిసెంబర్‌లో ద్రవ్యోల్బణం 3.2-3.3 శాతం మధ్యనేఉండవచ్చని పేర్కొన్న ఆ నివేదిక మార్చి నెలలో ద్రవ్యోల్బణం పెరిగే అవకాశమున్నప్పటికీ అది 4-4.5 శాతం లోపే ఉంటుందని ఆ నివేదిక స్పష్టం చేసింది. అందువల్ల కొత్త ఆర్థిక సంవత్సరంలో కూడా ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికే ప్రాధాన్యత ఇచ్చే ఆర్‌బిఐ విధానం కొనసాగవచ్చని ఎస్‌బిఐ నివేదిక అభిప్రాయ పడింది. రెపో రేటు అరశాతం మేర తగ్గించినప్పుడు (2016 ఏప్రిల్-అక్టోబర్ మధ్య) గృహ నిర్మాణ రంగానికి రుణాల పెరుగుదల రూ. 64 వేల కోట్లుగా ఉండింది. నోట్ల రద్దు సమయం (నవంబర్-డిసెంబర్ మధ్య) రుణాల వితరణ నెగెటివ్ వృద్ధిలో ఉన్నప్పటికీ గృహ నిర్మాణం రంగంలో మాత్రం రూ.4,063 కోట్ల మేర పెరిగిందని ఆ నివేదిక తెలిపింది. ఇప్పుడు ఎస్‌బిఐ లాంటి ప్రధాన బ్యాంకులన్నీ కూడా ఒకే సారి 0.9 శాతం దాకా వడ్డీ రేట్లను తగ్గించినందున మిగతా రంగాల్లో ఎలా ఉన్నా కనీసం గృహ నిర్మాణం రంగంలో క్రెడిట్ వృద్ధి బలంగా ఉండే అవకాశముందని కూడా ఆ నివేదిక పేర్కొంది.