బిజినెస్

అందరికీ డిజిటల్ సేవలు అందాలంటే స్మార్ట్ఫోన్ల ధరలు తగ్గాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖరగ్‌పూర్, జనవరి 5: భారత్‌లో ప్రజలు విరివిగా ఇంటర్నెట్, డిజిటల్ సేవలకు అనుసంధానం కావాలంటే దేశంలో ఎంట్రీ లెవెల్ స్మార్ట్ఫోన్ల ధరలను మరింత తగ్గించి కనీసం 30 డాలర్లకు చేర్చాల్సిన అవసరం ఉందని ప్రపంచ ఐటి దిగ్గజ సంస్థ గూగుల్‌కు అధినేతగా వ్యవహరిస్తున్న ప్రవాస భారతీయుడు సుందర్ పిచాయ్ ఉద్ఘాటించారు. గతంలో తాను విద్యనభ్యసించిన ఖరగ్‌పూర్ ఐఐటిలో గురువారం జరిగిన కార్యక్రమంలో ఆయన అక్కడి 3,500 మంది విద్యార్థులను, అధ్యాపకులను ఉద్దేశించి ప్రసంగించారు. డిజిటల్ ఎకానమీలో అంతర్జాతీయంగా ముఖ్యపాత్ర పోషించేలా భారత్‌ను తీర్చిదిద్దేందుకు దేశంలో ఇంటర్నెట్ అనుసంధానత (కనెక్టివిటీ)ని మెరుగుపర్చడంతో పాటు సమాచార సాంకేతిక పరిజ్ఞాన రంగంలో ప్రాంతీయ భాషలకు మరింత తోడ్పాటును అందజేయాల్సిన అవసరం ఎంతో ఉందని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ‘్భరత్‌లో ఎంట్రీ లెవెల్ స్మార్ట్ఫోన్ల ధరలు కొంత మేరకు తగ్గడం సంతోషాన్ని కలిగిస్తోంది. అయినప్పటికీ వీటి ధరలను ఇంకా తగ్గించి కనీసం 30 డాలర్లకు (దాదాపు 2000 రూపాయలకు) అందుబాటులోకి తీసుకురాగలిగితే ప్రజలకు ఎంతో మేలు చేసిన వారం అవుతామన్నది నా అభిప్రాయం’ అని ఆయన తెలిపారు.
భారత్ లాంటి వర్థమాన మార్కెట్లలోని వినియోగదారులకు చౌకధరల్లో అత్యంత నాణ్యమైన ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు హ్యాండ్‌సెట్ల తయారీదారులతో కలసి ‘ఆండ్రాయిడ్ వన్’ ప్రోగ్రామ్‌ను ప్రారంభించిన గూగుల్ సంస్థ ఇప్పటికే మైక్రోమ్యాక్స్, కార్బన్, స్పైస్ లాంటి భాగస్వామ్య సంస్థలతో కలసి కొన్ని హ్యాండ్‌సెట్లను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ హ్యాండ్‌సెట్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టినప్పుడు వాటి కనీస ప్రారంభ ధరను 6,399 రూపాయలుగా నిర్ణయించారు. అయితే ఈ హ్యాండ్‌సెట్లను మార్కెట్లో ప్రవేశపెట్టిన తర్వాత వాటి కంటే ఎంతో మెరుగైన ఫీచర్లతో తయారు చేసిన పలు హ్యాండ్‌సెట్లు తక్కువ ధరకే మార్కెట్లోకి వచ్చాయి. దీంతో ప్రస్తుతం దేశంలో వెయ్యి రూపాయల లోపు ధరకే స్మార్ట్ఫోన్లు అందుబాటులోకి రావడంతో పాటు కొంచెం మెరుగైన ఫీచర్లున్న ఫోన్లయితే 3 వేల రూపాయల లోపు ధరకు లభిస్తున్నాయి.
ఇదిలావుంటే, ప్రధాన మంత్రి అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘డిజిటల్ ఇండియా’ కార్యక్రమంలో తమ సంస్థ ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో పలు కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తోందని సుందర్ పిచాయ్ తెలిపారు. రైల్‌టెల్‌తో కలసి రైల్వే స్టేషన్లలో తాము ఉచితంగా అందజేస్తున్న వైఫై సేవలను, అలాగే దేశంలో నగదు చెల్లింపులను డిజిటలైజ్ చేసేందుకు ఎన్‌పిసిఐతో కలసి గూగుల్ సంస్థ ముందుకు సాగుతున్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.
డిజిటల్ రంగంలో చైనా స్థాయికి భారత్ ఎప్పుడు చేరుకుంటుందని ప్రశ్నించగా, డిజిటల్ ఎకానమీలో భారత్ కచ్చితంగా అంతర్జాతీయ స్థాయిలో ముఖ్య స్థానాన్ని సంపాదించుకోవడంతో పాటు ఈ రంగంలో ఏ దేశంతో అయినా పోటీపడగలుగుతుందని తాను గట్టి నమ్మకంతో ఉన్నానని, అందుకు అవసరమై బలమైన పునాదులు భారత్‌కు ఉన్నాయని పిచాయ్ తెలిపారు.

చిత్రం..ఖరగ్‌పూర్ ఐఐటిలో ప్రసంగిస్తున్న గూగుల్ సంస్థ సిఇఓ సుందర్ పిచాయ్