బిజినెస్

మార్కెట్లకు లాభాల కళ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 5: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం లాభాలతో కళకళలాడాయి. అమెరికా వడ్డీ రేట్ల పెంపు వేగం అనుకున్నంత వేగంగా ఉండకపోవచ్చన్న డిసెంబర్ నెల ఫెడరల్ రిజర్వ్ సమావేశం సంకేతాలతో బుధవారం అమెరికా స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగియడం, అదే బాటలో ఐరోపా మార్కెట్లలో కూడా సానుకూల ధోరణి కనిపించడంతో బిఎస్‌ఇ సెనె్సక్స్ 245 పాయింట్లకు పైగా లాభపడి రెండు నెలల గరిష్ఠ స్థాయి అయిన 26,878 పాయింట్లకు చేరువయింది. నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజి సూచీ నిఫ్టీ సైతం తిరిగి 8,200 పాయింట్ల స్థాయిని దాటిపోయింది. ఉదయం లాభాలతో ప్రారంభమైన సెనె్సక్స్ రోజంతా అదేబాటలో కొనసాగింది. ఫలితంగా 245.11 పాయింట్లు లాభపడి 26,878.24 పాయింట్ల వద్ద ముగిసింది. గత నవంబర్ 10 తర్వాత సెనె్సక్స్ ఇంత గరిష్ఠస్థాయికి చేరడం ఇదే మొదటిసారి. నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజి సూచీ నిఫ్టీ సైతం తిరిగి 8.200 పాయింట్ల స్థాయిని దాటింది. 83.30 పాయింట్లు లాభపడి 8,273.80 పాయింట్ల వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి బలపడ్డం కూడా మార్కెట్ సెంట్‌మెంట్‌కు ఊతమిచ్చింది. ఫలితంగా ఐటి, టెక్నాలజీ రంగాల షేర్లు తప్ప మిగతా రంగాలకు చెందిన షేర్లన్నీ కూడా లాభాల్లో ముగిశాయి. అదానీ పోర్ట్స్, టాటా స్టీల్, టాటా మోటార్స్, ఓఎన్‌జిసి, పవర్‌గ్రిడ్, మారుతి సుజుకి లాంటి ప్రముఖ కంపెనీల షేర్లన్నీ కూడా మంచి లాభాలు ఆర్జించాయి. అయితే టిసిఎస్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఇన్ఫోసిస్ లాంటి షేర్లు నష్టపోయాయి. సెనె్సక్స్‌లోని మొత్తం 30 కంపెనీల షేర్లలో 26 లాభాల్లో ముగియగా, నాలుగు మాత్రం నష్టాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్లలో హాంకాంగ్, షాంఘై మార్కెట్ల ప్రధాన సూచీలు లాభాల్లో ముగియగా, జపాన్‌కు చెందిన నిక్కీ మాత్రం నష్టాల్లో ముగిసింది. ఐరోపా మార్కెట్లలో కూడా మిశ్రమ స్పందన కనిపించింది.