క్రీడాభూమి

చైనా క్రికెట్‌కు మెగ్ చేయూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్, ఏప్రిల్ 11: ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మెగ్ లానింగ్ చైనా మహిళల క్రికెటర్లకు సహాయసహకారాలు అందించనుంది. సింగపూర్‌లో జన్మించిన మెగ్ తన సోదరి అన్నా లానింగ్ మాదిరిగానే క్రికెట్‌పై ఆసక్తిని పెంచుకుంది. ఆస్ట్రేలియా మహిళా జట్టులో స్థానం సంపాదించింది. అత్యుత్తమ ప్రతిభతో ఆ జట్టు కెపెన్‌గా పగ్గాలు చేపట్టింది. మహిళల క్రికెట్‌లో అక్కాచెల్లెళ్లు జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించడం చాలా అరుదు. సోదరి అన్నాతో కలిసి మెగ్ ఆస్ట్రేలియాకు అపూర్వ సేవలు అందిస్తున్నది. చైనాలో మహిళా క్రికెట్ అభివృద్ధికి ఇటీవలే ఆస్ట్రేలియా క్రికెట్ (సిఎ) నడుం బిగించింది. అందులో భాగంగానే షాంఘైలో జరుగుతున్న మహిళా క్రికెటర్ల శిక్షణాశిబిరానికి మెగ్‌ను పంపుతున్నట్టు ప్రకటించింది. అక్కడ వారికి క్రికెట్‌లో మెగ్ సూచనలిస్తుంది. అనంతరం ‘ఆస్ట్రేలియా వీక్’లో పాల్గొంటుంది. చైనాలో సుమారు 80,000 మంది వివిధ అకాడెమీల్లో శిక్షణ పొందుతుండగా, వారిలో సగానికిపైగా మహిళలే ఉన్నారు. ఇటీవల జరిగిన టి-20 ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే అర్హతను తృటిలో కోల్పోయిన చైనా 2018 లేదా 2020లో తప్పక క్వాలిఫై అవుతుందని మెగ్ ఒక ప్రకటనలో తెలిపింది. చైనాలో మహిళల క్రికెట్ అభివృద్ధి చెందడానికి సిఎ చేస్తున్న ప్రయత్నాలకు తనవంతు సాయం చేస్తానని మెల్బోర్న్‌లోని విక్టోరియా స్పిరిట్ క్లబ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న మెగ్ పేర్కొంది.