బిజినెస్

దాచడం కుదరట్లేదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 8: పాత పెద్ద నోట్ల రద్దుతో నల్లధనం వెలుగులోకి వచ్చిందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ స్పందిస్తూ ‘ఇన్నాళ్లూ అవినీతిపరులు, అక్రమార్కుల నీడలో దాగున్న సంపద నోట్ల రద్దుతో బయటపడుతున్నది చూస్తూనే ఉన్నాం కదా..’ అని అన్నారు. నల్లధనాన్ని దాచలేకపోతున్నారని, నల్లధన కుబేరులూ దొరికిపోతున్నారని గుర్తుచేశారు. ‘డిమానిటైజేషన్-రెండు నెలల సమీక్ష’ పేరుతో ఆదివారం ఫేస్‌బుక్‌లో చేసిన పోస్ట్‌లో జైట్లీ తన అభిప్రాయాలను నెటిజన్లతో పంచుకున్నారు. నల్లధనం, నకిలీ కరెన్సీల నిర్మూలన కోసం పాత 500, 1,000 రూపాయల నోట్లను కేంద్ర ప్రభుత్వం నిరుడు నవంబర్ 8న రద్దు చేస్తున్నట్లు ప్రకటించినది తెలిసిందే. జనవరి 8కి రెండు నెలలు కావడంతో జైట్లీ గడచిన రెండు నెలల్లో జరిగిన వాటిని గుర్తుచేసుకున్నారు. నోట్ల రద్దుతో ప్రజలు ఎంతో బాధలుపడ్డారని, అసౌకర్యానికి గురయ్యారన్న ఆయన ప్రస్తుతం పరిస్థితులు చక్కబడుతున్నాయని, మందగమనంలో ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థ కూడా పరుగందుకుంటోందని చెప్పారు. నిజానికి దేశ కరెన్సీలో 86 శాతానికి సమానమైన నోట్లను రద్దు చేస్తే.. సహజంగానే ఇబ్బందులు తలెత్తుతాయన్న జైట్లీ.. కొత్త కరెన్సీ చలామణి పెరగడంతో దాదాపు సాధారణ పరిస్థితులు నెలకొన్నాయన్నారు. అంతేగాక బ్యాంకుల్లో పెరిగిన డిపాజిట్లతో వడ్డీరేట్లు కూడా దిగివస్తున్నాయన్నారు. కాగా, బ్యాంకుల్లో డిపాజిట్ చేసినంత మాత్రాన నల్లధనం.. తెల్లధనంగా మారిపోదని పునరుద్ఘాటించారు. అక్రమార్కులు ఎన్ని అడ్డదారులు తొక్కినా దొరికిపోతున్నారని, చివరకు చట్టానికి చిక్కుతున్నారన్నారు.