బిజినెస్

మిస్ర్తి, వాడియా ఆరోపణలపై సెబీ ఆరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 8: సైరస్ మిస్ర్తి, నస్లీ వాడియాలను డైరెక్టర్లుగా తొలగించడంలో టాటా సన్స్ ఇన్‌సైడర్ ట్రేడింగ్ నిబంధనలు, కార్పొరేట్ గవర్నెన్స్ నియమాలను ఉల్లంఘించిందన్న ఆరోపణలపై మార్కెట్ రెగ్యులేటర్ సెబీ.. కొన్ని టాటా గ్రూప్ సంస్థల నుంచి వివరణ కోరింది. మిస్ర్తి, వాడియా నుంచి లేఖలు అందిన నేపథ్యంలో సెబీ పైవిధంగా స్పందించింది. 100 బిలియన్ డాలర్లకుపైగా విలువైన, 100కుపైగా సంస్థలున్న టాటా గ్రూప్.. యాజమాన్యమైన టాటా సన్స్ తమ చైర్మన్‌గా మిస్ర్తిని నిరుడు తొలగించినది తెలిసిందే. గ్రూప్‌లోని అన్ని సంస్థల డైరెక్టర్ పదవుల నుంచీ మిస్ర్తిని, ఆయన అనుచరులనూ టాటా సన్స్ తొలగిస్తోంది. ఈ క్రమంలో మిస్ర్తి న్యాయపోరాటం కూడా చేస్తున్నారు.