బిజినెస్

జిడిపి అంచనాలు ఢమాల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 9: ప్రపంచంలోనే పరుగులు పెడుతున్న జిడిపి భారత్ సొంతం. వృద్ధిరేటులో భారత్‌కు సాటిలేదు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు దిక్సూచి భారత్.. నిన్నమొన్నటిదాకా దేశ ఆర్థిక వ్యవస్థపై వినిపించిన అభిప్రాయాలివి. భారత్ జిడిపి తగ్గుముఖం పడుతోంది. పారిశ్రామిక వ్యవస్థలో మందగమనం కనిపిస్తోంది. వృద్ధిరేటు నెమ్మదించింది.. ఇవి ఇప్పుడు వ్యక్తమవుతున్న అభిప్రాయాలు. దీనికి కారణం అంతర్జాతీయ పరిణామాలు కావు. అమెరికా, ఐరోపా ఆర్థిక వ్యవస్థల సంక్షోభం అంతకన్నా కాదు. కేవలం రెండు నెలల క్రింద ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన నోట్ల రద్దు నిర్ణయం. అవును.. నల్లధనం, నకిలీ కరెన్సీల నిర్మూలన కోసం చేసిన 500, 1,000 రూపాయల నోట్ల రద్దుతో ప్రభుత్వ ఆశయం ఏమాత్రం నెరవేరనుందో తెలియదుకానీ, దేశ ఆర్థిక వ్యవస్థ మాత్రం కుదేలవుతోంది.
ప్రపంచంలో పేరెన్నికగల ఆర్థికవేత్తల అభిప్రాయమిదే. మొన్న బ్యాంక్ ఆఫ్ అమెరికా, నొమురా, మోర్గాన్ స్టాన్లీ, ఫిచ్, క్రిసిల్ తదితర అగ్రశ్రేణి రేటింగ్ ఏజెన్సీలు భారత జిడిపి వృద్ధి అంచనాలను తగ్గించగా, నేడు హెచ్‌ఎస్‌బిసి, సిటిగ్రూప్ తగ్గించాయ మరి. గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీలే కాదు.. సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వ వర్గాలూ ఇదే చెబుతున్నాయి. నోట్ల రద్దు కారణంగా నెలకొన్న విపత్కర పరిస్థితులు దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయని, ఆ వ్యాపారం, ఈ వ్యాపా రం.. ఆ రంగం, ఈ రంగం అనే తేడా లేకుండా అన్ని ఆర్థిక లావాదేవీలు పడిపోయాయని, ముఖ్యంగా బ్యాంకింగ్ లావాదేవీలు గణనీయంగా దిగజారాయని పేర్కొంటున్నాయ. దాదాపు రెండు నెలలపాటు కేవలం పాత నోట్ల డిపాజిట్లు, కొత్త నోట్ల సరఫరాకే పరిమితం కావడంతో పారిశ్రామిక రంగాలకు బ్యాంకర్ల నుంచి ఆర్థిక చేయూత కరువైంది. ఉత్పాదక సామర్థ్యం క్షీణించగా, మార్కెట్‌లో కొనుగోళ్లూ తగ్గిపోయాయి. ఈ క్రమంలోనే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2016-17) భారత జిడిపి వృద్ధిరేటు అంచనాను తాజాగా హెచ్‌ఎస్‌బిసి 6.3 శాతానికి దించింది. సిటిగ్రూప్ సైతం 6.8 శాతానికి కుదించింది. గతంలో 7.2 శాతంగా అంచనా వేసింది. 2017-18లో 7.5 శాతంగా నమోదు కావచ్చంది. ఇక అంతకుముందు బ్యాంక్ ఆఫ్ అమెరికా 6.9 శాతానికి తగ్గించింది. దీనికంటే ముందు ఈ అంచనా 7.4 శాతంగా ఉండేది. వచ్చే ఆర్థిక సంవత్సరం (2017-18) కూడా 7.2 శాతంగానే ఉండొచ్చంది. మరోవైపు ఫిచ్ రేటింగ్స్ కూడా 2016-17కు తమ జిడిపి అంచనాను 7.4 శాతం నుంచి 6.9 శాతానికి తీసుకొచ్చింది. 2017-18లో 7.7 శాతంగా, 2018- 19లో 8 శాతంగా ఉండొచ్చంది. స్టాండర్డ్ అండ్ పూర్స్‌కు చెందిన క్రిసిల్ కూడా భారత జిడిపి వృద్ధి అంచనాను కోసేసింది. 2016-17కుగాను ఏకంగా 7.9 శాతం నుంచి 6.9 శాతానికి దించింది. పడిపోయన వినియోగ సామర్థ్యం తోనేనని స్పష్టం చేసింది. ఇక మోర్గాన్ స్టాన్లీ సైతం 2016-17కు తమ జిడిపి అంచనాను 7.7 శాతం నుంచి 7.3 శాతానికి తగ్గించింది. 2017-18లో 7.7 శాతం, 2018-19లో 7.9 శాతంగా అంచనా వేసింది. ఇదిలావుంటే అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో దేశ జిడిపి వృద్ధి 6.5 శాతంగానే ఉండొచ్చని నొమురా అంచనా వేసింది. జనవరి-మార్చిలో 7 శాతంగా ఉంటుందని చెప్పింది. కేంద్ర గణాంకాల కార్యాలయం (సిఎస్‌ఒ) కూడా జూలై-సెప్టెంబర్‌లో దేశ జిడిపి వృద్ధి 7.3 శాతంగా ఉందని పేర్కొనగా, మున్ముందు త్రైమాసికాల్లో ఇది తగ్గవచ్చని అంచనా వేసినది తెలిసిందే. ముఖ్య ఆర్థిక సలహాదారు అర్వింద్ సుబ్రమణ్యన్ కూడా ఇదే అభిప్రాయం వెలిబుచ్చారు. అందుకు తగ్గట్లుగానే గత వారం ఈ ఆర్థిక సంవత్సరం దేశ జిడిపి వృద్ధిరేటు 7.1 శాతంగా ఉండవచ్చని సిఎస్‌ఒ అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరం (2015-16)లో ఇది 7.6 శాతంగా ఉండటం గమనార్హం. అయతే తయారీ, గనులు, నిర్మాణ రంగాల్లో నెలకొన్న మందగమనమే జిడిపి వృద్ధిరేటు తగ్గుదలకు కారణమని తాజాగా విడుదల చేసిన గణాంకాల్లో పేర్కొంది. పాత పెద్ద నోట్ల రద్దు ప్రభావం మాత్రం కాదని చెప్పుకొచ్చింది.
మరోవైపు పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో నెలకొన్న పరిణామాలన్నీ కూడా తాత్కాలికమే నని, భారత జిడిపి వృద్ధిరేటు ఈ ఆర్థిక సంవత్సరం 7 శాతానికిపైగానే నమోదవుతుందని సిస్కో అన్నది. రాబోయే కొనే్నళ్లలో కూడా ఆశాజనకమైన వృద్ధిరేటును భారత్ సాధిస్తుం దని సిస్కో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జాన్ చాంబర్స్ అంచనా వేశారు. అయతే అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలో కొలువుదీరే కొత్త ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు భారతీయ ఐటి రంగాభివృద్ధికి ప్రతిబంధకాలుగా మారవచ్చన్న ఆందోళనను వ్యక్తం చేశారు. హెచ్-1బి వీసాల జారీకి సంబంధించి కీలక మార్పులను ప్రతిపాదిస్తున్న బిల్లు అమెరికా కాంగ్రెస్‌లోకి మళ్లీ రావడం.. భారతీయ మార్కెట్లనూ కుదిపేస్తున్నది తెలిసిందే. దేశీయ ఐటి రంగ సంస్థల ఆదాయంలో అగ్ర భాగం విదేశాల నుంచే వస్తుంది. అందులో అగ్రరాజ్యం అమెరికా వాటా ఎక్కువే. టిసిఎస్, ఇన్ఫోసిస్, విప్రో ఇలా అన్ని ఐటి సంస్థల అమెరికా వ్యాపారం ఆధారపడింది హెచ్-1బి వీసాలపైనే. ఈ వీసాల ద్వారానే భారత్ నుంచి అమెరికాకు తమ ఉద్యోగులను పంపిస్తున్నాయి ఐటి సంస్థలు. అయితే హెచ్-1బి వీసాల వినియోగంపై ఆంక్షలు పెట్టడానికి సిద్ధమవుతోంది ఇప్పుడు అమెరికా. దీంతో గత వారం కేవలం ఐటి షేర్ల మార్కెట్ విలువే 22,000 కోట్ల రూపాయలకుపైగా ఆవిరైపోవడం గమనార్హం.