బిజినెస్

జిఎస్‌టి వివరాలు 15లోగా ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 9: తెలంగాణ రాష్ట్రంలోని డీలర్లంతా వెంటనే జిఎస్‌టి ఎన్‌రోల్‌మెంట్ అప్లికేషన్లను అందచేయాలని వాణిజ్య పన్నుల కమిషనర్ ఆదేశించారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ, డీలర్లకు వాణిజ్య పన్నుల శాఖ ద్వారా ఐడిలు, పాస్‌వర్డ్‌లు పంపించామని, వీటిని అందుకున్న వారంతా, జిఎస్‌టి పోర్టల్‌కు పూర్తి వివరాలు ఇవ్వాలన్నారు. జిఎస్‌టి పోర్టల్ డేటా మైగ్రేషన్ ఈ నెల 15లోగా పూర్తి చేయాల్సి ఉందన్నారు. రాష్ట్రంలోని డీలర్ల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ట్యాక్స్ ప్రాక్టిషనర్లు అప్లికేషన్ ఎన్‌రోల్‌మెంట్ విధానాన్ని వేగంగా పూర్తి చేసేందుకు సహకరించాలని కోరారు. ప్రభుత్వ ఆదేశాలను తు.చ తప్పకుండా పాటించేవారికి అభినందన సర్ట్ఫికెట్లు కూడా అందిస్తామని ప్రకటించారు. జిఎస్‌టి అమలులో తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలు విజయవంతం అయ్యేందుకు వ్యాపార, వాణిజ్య వర్గాలంతా సహకరించాలని కమిషనర్ కోరారు.