బిజినెస్

15.28 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 9: ఈ 2016-17 ఆర్థిక సంవత్సరంలో 18.27 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటికే 15.28 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని తెలంగాణ పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. సేకరించిన ధాన్యంలో 15.13 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యా న్ని మిల్లింగ్‌కు ఇచ్చామని సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో మంత్రి పేర్కొన్నారు. సాధ్యమైనంత త్వరగా అందించాలని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులను మంత్రి కోరారు. కాగా, హాస్టల్స్‌కు సన్న బి య్యం సరఫరా చేస్తుండటంతో ఓపెన్ మార్కెట్‌లో కొనుగోలు చేయడం వల్ల ప్రభుత్వంపై అధిక భారం పడుతోందని, ఈ భారాన్ని తగ్గించడానికి రైతుల నుంచి నేరుగా 1.2 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని నిర్ణయించినట్టు మంత్రి పేర్కొన్నారు. వచ్చే సీజన్‌లో కూడా భారీగా ధాన్యాన్ని సేకరించనున్నామన్న ఆయన కిలో బియ్యాన్ని రూపాయి చొప్పున పేదలకు అందిస్తుంటే, కొంతమంది దళారులు దాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ను మంత్రి ఆదేశించారు. నిజానికి ఓపెన్ మార్కెట్‌లో కిలో బియ్యానికి 24 రూపాయలు చెల్లిస్తున్నామని, ఏటా బియ్యంపై 2,395 కోట్ల భారాన్ని ప్రభుత్వం భరిస్తోందన్నారు.