బిజినెస్

శ్రీసిటీని సందర్శించిన తెలంగాణ పారిశ్రామికవేత్తల బృందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సత్యవేడు, జనవరి 9: తెలంగాణ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్ బాలమళ్ళు నేతృత్వంలో పది మందితో కూడిన పారిశ్రామిక వేత్తల బృందం సోమవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా శ్రీసిటీని సందర్శించింది. వీరికి శ్రీసిటీ ప్రెసిడెంట్ రమేష్ సుబ్రహ్మణ్యం స్వాగతం పలికి సెజ్‌లో వౌలిక వసతులు, పారిశ్రామిక ప్రగతిని వివరించారు. బిజినెస్ సెంటర్‌లో సమావేశమై సుదీర్ఘంగా చర్చించిన బృందం.. శ్రీసిటీని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసింది. తెలంగాణలో పారిశ్రామిక క్లస్టర్ ఏర్పాటులో భాగంగా పలు పారిశ్రామిక వాడలను సందర్శిస్తున్నట్లు బృందం చెప్పింది. పొరుగు రాష్ట్రంలో మంచి పారిశ్రామిక వాడల ఏర్పాటుకు శ్రీసిటీ పరిశీలన ఎంతో సహాయపడుతుందని ఎండి రవీంద్ర సన్నారెడ్డి అన్నారు. ఈ పర్యటనలో టిఎస్‌ఐఐసి అధ్యక్షుడు సుధీర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.