బిజినెస్

పెట్రోల్ బంక్‌లపై ఐటిశాఖ నజర్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 9: పాత పెద్దనోట్ల రద్దు తరువాత బంగారం కొనుగోళ్ల మాటున నల్లధనం మార్పిడి జరిగినట్టు గుర్తించిన ఆదాయపు పన్ను శాఖ (ఐటి) అధికారులు.. ఇప్పుడు పెట్రోల్ బంకులపై దృష్టిసారించారు. నోట్ల రద్దు తరువాత కూడా చాలాకాలం వరకు పెట్రోల్ బంకుల్లో నగదు లావాదేవీలు అంగీకరించడంతో ఇక్కడ కూడా అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్టు ఐటి అధికారులు అనుమానిస్తున్నారు. వాస్తవంగా జరిగిన అమ్మకాల కంటే ఎక్కువ మొత్తంలోనే డిపాజిట్లు జరిగినట్టు అధికారులు గుర్తించినట్టు విశ్వసనీయ సమాచారం.
దీనికి సంబంధించి ఇప్పటికే రాష్టవ్య్రాప్తంగా అనేక పెట్రోల్ బంకుల అమ్మకాలు, కొనుగోళ్లకు చెందిన దస్త్రాలను ఐటి అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. వీటన్నింటిని పరిశీలించి పెట్రోల్ బంకుల యజమానులపై తగు చర్యలు తీసుకోనున్నట్టు ఓ సీనియర్ ఐటి అధికారి తెలిపారు. పాత పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన నవంబర్ 8వ తేదీ రాత్రికి రాత్రే అనేక బంగారు దుకాణాల్లో వందల కోట్ల రూపాయల లావాదేవీలు జరిగిన సంగతి తెలిసిందే. పసిడి కొనుగోళ్ల రూపంలో తమ వద్ద ఉన్న నల్లధనాన్ని చట్టబద్ధం చేసినట్టు అధికారులు ఇప్పటికే గుర్తించారు. అదేవిధంగా ఇప్పుడు పెట్రోల్ అమ్మకాల రూపంలోనూ కొంత గల్లంతు జరిగినట్టు ఐటి అధికారులు గుర్తించారు. ప్రతి రోజు కోట్ల రూపాయల విలువచేసే పెట్రోల్, డీజిల్ అమ్మకాలు జరుగుతుంటాయి. నోట్ల రద్దు తర్వాత చాలాకాలం వరకూ బంకుల్లో రద్దయిన పెద్దనోట్లు చలామణి చేసేందుకు అవకాశం కల్పించారు. కాగా, డిసెంబర్ 30తో బ్యాంకుల్లో రద్దయన నోట్ల నగదు డిపాజిట్ గడువు పూర్తయింది. దాంతో ఏ మేరకు లావాదేవీలు జరిగాయన్న విషయాన్ని ఐటీ అధికారులు వడపోస్తున్నారు. ఈ సందర్భంగానే పెట్రోల్ బంక్‌ల ద్వారా కొంత అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్టు గుర్తించారని తెలుస్తోంది. పెట్రోలియం సంస్థల నుంచి బంకులకు సరఫరా చేసిన పెట్రోల్, డీజిల్‌ను వినియోగదారులకు అమ్ముతుంటారు. ఏ బంకు ఎంత మొత్తంలో పెట్రోలియం ఉత్పత్తులు తెచ్చుకుంది అన్న వివరాలు అందుబాటులో ఉంటాయి. కొన్ని బంకులకు సరఫరా అయిన ఇంధనం కంటే ఎక్కువ అమ్మినట్టు చూపించి ఆ మొత్తం బ్యాంకుల్లో డిపాజిట్ చేసినట్టు తెలుస్తోంది. అమ్మిన దానికంటే ఎక్కువ డిపాజిట్ చేశారంటే అదనంగా ఉన్న నల్లధనాన్ని కూడా అమ్మకాల రూపంలో డిపాజిట్ చేసి ఉండాలి. ఈ మొత్తం కొన్ని కోట్ల రూపాయలు ఉన్నట్టు ఐటి అధికారులు చెబుతున్నారు. దాంతో అసలు ఏం జరిగిందన్న విషయం తెలుసుకోవాలంటే బంకుల వారీగా జరిగిన అమ్మకాలు విశే్లషించాలి. దాంతో రాష్టవ్య్రాప్తంగా వివిధ బంకులకు సంబంధించిన బ్యాంకు లావాదేవీల వివరాలు, అమ్మకాలకు సంబంధించిన దస్త్రాలపై ఐటీ అధికారులు దృష్టి సారించారు. ఇప్పటికే కొన్ని బంకుల నుంచి దస్త్రాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. అమ్మకాలు, డిపాజిట్‌లపై అవకతవకలు జరిగినట్టు తేలితే కేసులు నమోదు చేస్తామని ఐటీ అధికారులు తెలిపారు.