బిజినెస్

28 శాతం పెరిగిన టాటా స్టీల్ ఉత్పత్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 9: ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) మూడో త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో టాటా స్టీల్ అమ్మకపు ఉక్కు ఉత్పత్తి 28 శాతం పెరిగింది. 3.2 మిలియన్ టన్నులుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) అక్టోబర్-డిసెంబర్‌లో ఇది 2.5 మిలియన్ టన్నులుగా ఉంది. ఈ మేరకు సోమవారం సంస్థ బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు తెలియజేసింది. ముడి ఉక్కు ఉత్పత్తి కూడా గతంతో పోల్చితే 2.5 మిలియన్ టన్నుల నుంచి 3.2 మిలియన్ టన్నులకు పెరిగింది. ఇక అమ్మకాలు ఈసారి దాదాపు 3 మిలియన్ టన్నులుగా ఉన్నాయని, నిరుడు 2.3 మిలియన్ టన్నులకే పరిమితమయ్యాయని చెప్పింది.