బిజినెస్

జెఎల్‌ఆర్ అమ్మకాల్లో 12 శాతం వృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 9: టాటా మోటార్స్‌కు చెందిన లగ్జరీ కార్ల బ్రాండ్ జాగ్వార్ లాండ్ రోవర్ (జెఎల్‌ఆర్) అమ్మకాలు గత నెల డిసెంబర్‌లో 12 శాతం పెరిగాయి. ఈసారి 55,375 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. మొత్తం 2016 సంవత్సరంలో సంస్థ అమ్మకాలు 5,83,312 యూనిట్లుగా ఉన్నట్లు జెఎల్‌ఆర్ సోమవారం తెలిపింది. అంతకుముందు సంవత్సరం విక్రయాలు 20 శాతం తక్కువగా ఉన్నాయి. జాగ్వార్ ఎఫ్-పేస్, లాండ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్, రేంజ్ రోవర్ స్పోర్ట్ మోడల్స్‌కు ఎక్కువగా ఆదరణ లభించింది.