బిజినెస్

2 శాతం తగ్గనున్న జిడిపి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 12: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని చివరి రెండు త్రైమాసికాల్లో భారత స్థూల జాతీయోత్పత్తి (జిడిపి) వృద్ధి రేటు 2 శాతం తగ్గవచ్చని ప్రముఖ అంతర్జాతీయ ఆర్థిక సేవల సంస్థ హెచ్‌ఎస్‌బిసి అంచనా వేసింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రస్తుతం దేశంలో చలామణిలో ఉన్న కరెన్సీ పరిమాణం భారీగా తగ్గడమే ఇందుకు కారణమని ఆ సంస్థ పేర్కొంది. అయితే ప్రభుత్వం మరిన్ని కరెన్సీ నోట్లను ముద్రిస్తే జిడిపి వృద్ధి రేటు మళ్లీ 7 శాతానికి చేరుకునే అవకాశాలున్నాయని హెచ్‌ఎస్‌బిసి తన అధ్యయన నివేదిలో స్పష్టం చేసింది. దేశంలో పాత 500, 1000 రూపాయల నోట్ల చలామణిని రద్దుచేసి వాటి స్థానంలో కొత్త నోట్లను అందుబాటులోకి తీసుకురావడం వలన స్థూల ఆర్థిక వ్యవస్థపై ఏడాది పాటు మిశ్రమ ప్రభావం పడవచ్చని భావిస్తున్నట్లు ఆ సంస్థ తెలిపింది.