బిజినెస్

మూడు టెలికామ్ సంస్థలకు భారీ పెనాల్టీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 12: నాసిరకం సేవలందించే టెలికాం ఆపరేట్లపై జరిమానాలు విధించే అధికారం డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికాం (డాట్)కు ఉందని అటార్నీ జనరల్ అభిప్రాయ పడినట్లు తెలుస్తోంది. దీంతో ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా సెల్యులార్ సంస్థలపై రూ. 3,050 కోట్ల పెనాల్టీలు విధించడానికి మార్గం సుగమమైంది. సేవల నాణ్యతకు సంబంధించిన నిబంధనలను ఉల్లంఘించినందుకు టెలికాం ఆపరేటర్లపై డాట్ పెనాల్టీలను విధించవచ్చని అటార్నీ జనరల్ అభిప్రాయపడినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సేవల నాణ్యతకు సంబంధించిన నిబంధనలను ఉల్లంఘించినందుకు ఎయిర్‌టెల్, వొడాఫోన్‌లపై చెరి రూ. 1,050కోట్లు, ఐడియాపై రూ.950 కోట్లు పెనాల్టీలు విధించాలని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) సిఫార్సు చేసింది. కాల్స్ ఫెయిల్యూర్‌లు ఎక్కువగా ఉండడం, రిలయన్స్ జియోకోసం ఏర్పాటు చేసిన ఇంటర్‌కనెక్ట్ పాయింట్ల వద్ద రద్దీలాంటి కారణాల దృష్ట్యా ఈ మూడు కంపెనీలు లైసెన్స్ షరతులు, సేవల నాణ్యతకు సంబంధించిన నిబంధనలను ఉల్లంఘించినట్లు డాట్‌కు పంపిన సిఫార్సుల్లో ట్రాయ్ పేర్కొంది. కాగా, దీనిపై డాట్ గత వారం ఎజి అభిప్రాయాన్ని కోరింది. ఇప్పుడున్న టెలికాం కంపెనీలు తగినన్ని ఇంటర్‌కనెక్ట్ పాయింట్లను సమకూర్చకపోవడం వల్ల తమ నెట్‌వర్క్‌పై 75 శాతానికి పైగా కాల్స్ ఫెయిల్ అవుతున్నాయని రిలయన్స్ జియో ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ట్రాయ్ ఈ సిఫార్సులు చేసింది.