బిజినెస్

రూ.600 కోట్లు చెల్లిస్తారా.. మళ్లీ జైలుకెళ్తారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 12: మార్కెట్ నియంత్రణా సంస్థ ‘సెబీ’ (సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌చేంజి బోర్డ్ ఆఫ్ ఇండియా)-సహారా రిఫండ్ ఖాతాలో ఫిబ్రవరి 6వ తేదీలోగా మరో 600 కోట్ల రూపాయలు డిపాజిట్ చేయాలని లేదంటే జైలుకు వెళ్లాలని సహారా గ్రూపు అధినేత సుబ్రతారాయ్‌కి సుప్రీం కోర్టు గురువారం స్పష్టం చేసింది. ఇప్పటికే ఈ విషయంలో సహారా అధినేతకు చాలా వెసులుబాటు కల్పించామని ప్రధాన న్యాయమూర్తి జెఎస్.కెహర్, జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎకె.సిక్రీలతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం పేర్కొంది. ఇప్పటివరకూ సహారా తమ పెట్టుబడిదారులకు మొత్తం 18 వేల కోట్ల రూపాయలను తిరిగి చెల్లించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో తొలుత సెబీకి రెండు నెలల్లోగా 1000 కోట్ల రూపాయలు డిపాజిట్ చేయాలని సహారా అధినేతకు సూచించిన ధర్మాసనం ఆ దానిని దాదాపు రూ.600 కోట్లకు తగ్గించి వచ్చే నెల 6వ తేదీలోగా ఆ సొమ్మును డిపాజిట్ చేయాలని స్పష్టం చేసింది. అయితే సహారా గ్రూపు తమ పెట్టుబడిదారులకు చెల్లించాల్సిన అసలు సొమ్ము రూ.24 వేల కోట్లతో పాటు దానిపై వడ్డీ కలిపి మొత్తం 37 వేల కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉందని సెబీ గతంలో తెలియజేసింది. దీంతో 2007 నుంచి 2008 మధ్య కాలంలో ఫుల్లీ కన్వర్టబుల్ డిబెంచర్ల ద్వారా సహారా ఇండియా రియల్ ఎస్టేట్ కార్పొరేషన్ లిమిటెడ్, సహారా హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ సేకరించిన సొమ్ముపై 15 శాతం వడ్డీతో కలిపి మొత్తం 17,600 కోట్ల రూపాయలను తిరిగి పెట్టుబడిదారులకు చెల్లించాలని 2012లో సుప్రీం కోర్టు ఆదేశించింది. అయితే ఈ ఆదేశాలను పాటించడంలో సుబ్రతారాయ్ విఫలమవడంతో 2014 మే 4వ తేదీన ఆయనను జైలుకి పంపడంతో పాటు పెట్టుబడిదారులకు దాదాపు 22 వేల కోట్ల రూపాయలను చెల్లించలేదన్న కేసులో ఆయనపై నేరుగా అభియోగాలు నమోదు చేశారు.