బిజినెస్

ఆ డ్రెయిన్‌తో సంబంధం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, జనవరి 12: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఆనంద గ్రూప్ సంస్థ ద్వారా గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్కుకు, గొంతేరు డ్రెయిన్‌కు ఎటువంటి సంబంధం లేదని ఫుడ్‌పార్కు డైరెక్టర్ ఉద్దరాజు జోగిరాజు స్పష్టంచేశారు. కొంతమంది రాజకీయ లబ్ధి కోసం ఆక్వా రైతాంగానికి ఉపయోగపడే ఫుడ్ పార్కుపై విషప్రచారం చేస్తున్నారన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపంలోని తుందుర్రులో నిర్మిస్తున్న గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్కుపై అనుమానాలుంటే స్వయంగా వచ్చి పరిశీలించుకుని అనుమానాలను నివృత్తి చేసుకోవాలని విజ్ఞప్తిచేశారు. భీమవరంలో గురువారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫుడ్ పార్కులో నిర్మిస్తున్న కోల్డ్ స్టోరేజి వల్ల మత్స్యకార కుటుంబాలకే ఎక్కువగా లాభం చేకూరుతుందన్నారు. నరసాపురం నియోజకవర్గం మొగల్తూరు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన మత్స్యకార కుటుంబాలు దీనిపై అవగాహనకు రావాలని కోరారు.
సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర రైతు కార్యాచరణ సమితి కార్యదర్శి లంకా కృష్ణమూర్తి మాట్లాడుతూ కొనే్నళ్ల క్రితం నుంచి చేపలు, రొయ్యల చెరువులు సాగుచేసి, రైతులు నష్టాలను చవిచూస్తున్నారని, దీంతో వారంతా ఆ చెరువులను వీడి వలసలు పోయారన్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా ఈ ప్రాంతంలో సముద్ర ఉత్పత్తులను నిల్వ చేసుకోవడానికి కోల్డ్ స్టోరేజి ఏర్పాటుచేయాలని ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రిని కలిసి ఎన్నో వినతిపత్రాలు అందించారన్నారు. ఈ ఉద్యమ ఫలితంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోల్డ్ స్టోరేజిని గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్కు పేరుతో ఎకరం 70 సెంట్లు భూమిలో నిర్మిస్తోందన్నారు. తుందుర్రులో ఫుడ్ పార్కు నిర్మాణాన్ని వెంటనే పూర్తిచేయాలని ప్రభుత్వాన్ని దళిత ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు గంటా సుందర్‌కుమార్ డిమాండ్ చేశారు.

చిత్రం..విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న ఫుడ్‌పార్కు డైరెక్టర్ జోగిరాజు