బిజినెస్

వృద్ధిపథంలో ఎగుమతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 13: దేశీయ ఎగుమతులు వరుసగా నాలుగో నెల వృద్ధిరేటును అందుకున్నాయి. గత నెల డిసెంబర్‌లో 5.71 శాతం వృద్ధితో 23.88 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. పెట్రోలియం, ఇంజినీరింగ్, ఔషధ రంగాల ఉత్పత్తులకు విదేశాల్లో మంచి ఆదరణ లభించింది. అయితే డిసెంబర్‌లో దిగుమతులు కూడా గతంతో పోల్చితే 0.47 శాతం పెరిగాయి. 34.25 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. దీంతో వాణిజ్య లోటు 10.3 బిలియన్ డాలర్లుగా నమోదైంది. 2015 డిసెంబర్‌లో ఇది 11.5 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు శుక్రవారం కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా, ఇంజినీరింగ్ ఎగుమతులు దాదాపు 20 శాతం పెరిగితే, పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతి 8.22 శాతం, ఔషధరంగ ఎగుమతులు 12.49 శాతం పెరిగాయి. బంగారం దిగుమతులు 48.49 శాతం పడిపోయి 1.96 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. తాజా గణాంకాలపై భారతీయ ఎగుమతి సంస్థల సమాఖ్య (ఎఫ్‌ఐఇఒ) స్పందిస్తూ భారతీయ ఎగుమతులకు అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయంది. అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు, పాత పెద్ద నోట్ల రద్దు ప్రభావం ఎగుమతుల రంగంపై పాక్షికంగానే కనిపించిందని ఎఫ్‌ఐఇఒ అధ్యక్షుడు ఎస్‌సి రల్హన్ చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17)లో భారత ఎగుమతులు 270-280 బిలియన్ డాలర్లను తాకవచ్చన్నారు. కాగా, నిరుడు ఏప్రిల్-డిసెంబర్‌లో దేశీయ ఎగుమతులు స్వల్పంగా 0.75 శాతం పెరిగి 198.8 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. దిగుమతులు 275.3 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఇకపోతే సేవా రంగం ఎగుమతులు నవంబర్‌లో 1.72 శాతం పెరిగాయని వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.