బిజినెస్

స్టాక్ మార్కెట్లకు ఐటి దెబ్బ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 13: తీవ్ర ఒడిదుడుకుల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం స్వల్ప నష్టాలను అందుకున్నాయి. ఆరంభంలో లాభాల్లో కదలాడినప్పటికీ దేశీయ ఐటిరంగ దిగ్గజాలైన టిసిఎస్, ఇన్ఫోసిస్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలు మదుపరులను మెప్పించలేకపోవడంతో చివరిదాకా ఆ లాభాలు కొనసాగలేకపోయాయి. ఈ క్రమంలోనే గడచిన నాలుగు రోజుల్లో తొలి నష్టాలను నమోదు చేస్తూ బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 9.10 పాయింట్లు పడిపోయి 27,238.06 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 6.85 పాయింట్లు కోల్పోయి 8,400.35 వద్ద నిలిచింది. ఇకపోతే ఈ వారం మొత్తంగా సెనె్సక్స్ 478.83 పాయింట్లు, నిఫ్టీ 156.55 పాయింట్లు పెరిగాయి. కాగా, శుక్రవారం ట్రేడింగ్‌లో ఐటి, టెక్నాలజీ, ఆటో, పవర్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, రియల్టీ, క్యాపిటల్ గూడ్స్ రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఎఫ్‌ఎమ్‌సిజి, బ్యాంకింగ్, హెల్త్‌కేర్, చమురు, గ్యాస్ రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఆసియా మార్కెట్లలో హాంకాంగ్, జపాన్ సూచీలు లాభపడితే, చైనా సూచీ నష్టపోయింది. ఐరోపా మార్కెట్లలో ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ సూచీలు లాభపడ్డాయి.