బిజినెస్

రెండో ఏడాదీ క్షీణించిన చైనా ఎగుమతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, జనవరి 13: ప్రపంచంలోనే అతిపెద్ద ఎగుమతిదారైన చైనా.. వరుసగా రెండో సంవత్సరం ఎగుమతుల క్షీణతను చవిచూసింది. 2016లో చైనా ఎగుమతులు 7.7 శాతం పడిపోయాయి. 2015లోనూ 2.8 శాతం మేర చైనా ఎగుమతులు దిగజారాయి. ఈ క్రమంలో నిరుడు మరింతగా దేశీయ ఎగుమతులు పతనం కావడంపట్ల చైనా ఆందోళనలో పడింది. ఎగుమతుల్లో ఇప్పటికే అమెరికాతో చైనాకు తీవ్ర పోటీ నెలకొనగా, నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సారథ్యంలో ఈ పోటీ మరింత పెరగగలదన్న అంచనాలున్నాయి. దీంతో మున్ముందు దేశీయ ఎగుమతులు మరింతగా తగ్గిపోతాయా? అన్న భయం చైనాకు పట్టుకుంది. ఇదిలావుంటే తాజా గణాంకాల ప్రకారం చైనా ఎగుమతులు 2016లో 2.1 ట్రిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దిగుమతులు 1.59 ట్రిలియన్ డాలర్లుగా ఉన్నాయి. దీంతో వాణిజ్య మిగులు 486 బిలియన్ డాలర్లుగా ఉంది. 2015తో పోల్చితే ఇది 9.1 శాతం తక్కువ.