బిజినెస్

చులకన చేయొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 15: ఆన్‌లైన్ మార్కెటింగ్ దిగ్గజం అమెజాన్.. భారతీయ చిహ్నాలు, ప్రతీకలపట్ల వ్యవహరిస్తున్న తీరును కేంద్రం తీవ్రంగా పరిగణించింది. ఈ రకమైన చులకన భావాన్ని సహించబోమని, మార్పు రాకపోతే ఇబ్బందులేనని హెచ్చరించింది. కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ ఈ మేరకు ఆదివారం అమెజాన్‌కు స్పష్టమైన సంకేతాలిచ్చారు. భారతీయ చిహ్నాలు, ప్రతీకల గురించి చులకనభావాన్ని వీడాలని హితవు పలికారు. ‘ఈ రకమైన విపరీత ధోరణితో మీకే నష్టం’ అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. భారతీయ త్రివర్ణ పతాకంతో కూడిన డోర్‌మ్యాట్లను అమెజాన్ విక్రయించడంపై గత వారం కేంద్రం తీవ్రంగా స్పందించినది తెలిసిందే. దీంతో ఈ డోర్‌మ్యాట్లకు సంబంధించిన ఓ ఆర్టికల్‌ను తమ కెనడియన్ వెబ్‌సైట్ నుంచి అమెజాన్ వెంటనే తీసేసింది. భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్.. అమెజాన్‌పై ఫిర్యాదులు అందుకోగా, ఆ రకమైన అమ్మకాలను తక్షణమే నిలిపివేయాలని స్పష్టం చేశారు కూడా. జాతిపిత మహాత్మా గాంధీ చిత్రంతో ఫ్లిప్-్ఫ్లప్‌లను అమెజాన్ అమ్ముతుండటంపైనా సుష్మాకు ఫిర్యాదులు అందాయి.