బిజినెస్

దేశీయ మార్కెట్‌ను ముంచెత్తుతున్న విదేశీ వంట నూనెలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జనవరి 15: విదేశీ వంట నూనెలు స్వదేశీ మార్కెట్లను ముంచెత్తుతున్నాయి. ఫలితంగా వంట నూనెలను దేశీయంగానే తయారు చేసి, విక్రయంచాలన్న కల.. కలగానే మిగిలిపో తోంది. స్వయం సమృద్ధి సాధించేందుకు గత రెండు దశాబ్దాలుగా చేస్తున్న ప్రయత్నం కేవలం 10 శాతానికే పరిమితమైంది. 90 శాతం అవసరాలు విదేశీ వంట నూనెలపైనే తీరుతున్న పరిస్థితి.
ముఖ్యంగా నవ్యాంధ్రలో ఆయిల్‌పామ్ పంటను విస్తరించేందుకు రకరకాల సబ్సిడీలతో రైతులను ప్రోత్సహించారు. సరళీకృత ఆర్థిక విధానాల నేపథ్యంలో పంట విస్తీర్ణానికి సంబంధించి కొన్ని స్వదేశీ కార్పొరేట్ సంస్థలకు విస్తరణ బాధ్యతలు అప్పగించారు. ఆయిల్‌పామ్ పంటసాగుకు అనువుగా ఉన్న భూములను జిల్లాలవారీగా కొన్ని కంపెనీలకు కేటాయించారు. ఎంత చేసినా ఇప్పటికీ స్వయం సమృద్ధి అనేది సాధ్యపడలేదు. అంతర్జాతీయ మార్కెట్‌ను ఆసరా చేసుకుని సాగే ఈ పంటకు ప్రస్తుతం ధరలు ఆశాజనకంగానే ఉన్నాయ. టన్ను ఆయిల్ గెలలకు 8,464 రూపాయలు ఇస్తున్నారు. 2016 డిసెంబర్ చివరి వారం నుంచి ఆయిల్ పామ్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. గత ఆగస్టులో 7,250 రూపాయలు పలికింది. రాష్ట్రంలోనే అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 42 వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేస్తున్నారు. మెట్ట ప్రాంతంలో అత్యధికంగా ఈ పంట సాగును ప్రోత్సహించారు. రంగంపేట, గండేపల్లి, రాజానగరం, పెద్దాపురం మండలాల్లో 70 శాతం వరకు పంట సాగవుతోంది. కాగా, మలేషియా కేంద్రంగా వంట నూనెల వ్యాపారం సాగుతోంది. పండుగలతో సంబంధం లేకుండా అంతర్జాతీయ మార్కెట్ ఆధారంగా ఆయిల్ ధరలు ఆధారపడి ఉంటాయి. కేవలం 10 శాతం మాత్రమే స్థానిక ఉత్పత్తి అవగా, మిగిలిన 90 శాతం అవసరాలకు విదేశాల నుంచి వంట నూనెలను దిగుమతి చేసుకుంటున్నారు.
కాకినాడ, కృష్ణపట్నం పోర్టుల నుంచి పెద్ద ఎత్తున ఆయిల్ నిల్వలను దిగుమతి చేసుకుంటున్నారు. ఉక్రేయిన్ నుంచి సన్‌ఫ్లవర్ ఆయిల్, మలేషియా నుంచి పామాయిల్ దిగుమతి అవుతోంది. పాత పెద్ద నోట్ల రద్దు కూడా ఈ మార్కెట్‌ను ప్రభావితం చేయడం లేదు. ఎందుకంటే లావాదేవీలన్నీ ఆన్‌లైన్‌లో నగదు రహితంగానే సాగుతాయి కాబట్టి దిగుమతులకు ఎటువంటి ఇబ్బందులు లేవు. అయితే స్థానికంగా మాత్రం కొనుగోళ్లు మందగమనంలో సాగుతున్నాయని హోల్‌సేల్ వ్యాపారులు చెబుతున్నారు. గోదావరి జిల్లాల్లో అతిపెద్ద హోల్‌సేల్ మార్కెట్ అయిన రాజమహేంద్రవరంలో రోజుకు ఐదు కోట్ల రూపాయల టర్నోవర్ ఉండే ఆయిల్ లావాదేవీలు కోటి రూపాయలకి పడిపోయాయ. హోల్ సేల్ మార్కెట్‌లో సన్‌ఫ్లవర్ ఆయిల్ కేజీ 78 రూపాయల నుంచి 80 రూపాయలు పలుకుతోంది. నిరుడు పండుగ సమయానికి, ఇప్పటికీ ధరల విషయంలో పెద్ద తేడా కనిపించడం లేదు. పామాయిల్ ధర ప్రస్తుతం కిలో 68 రూపాయలుగా ఉంది. స్థానికంగా ఉత్పత్తయ్యే వేరుశెనగ, రైస్ బ్రాన్ ఆయిల్ ధరలు కేజీ 80 రూపాయల వరకు పలుకుతున్నాయి. కానీ వీటి వాడకం చాలా తక్కువగా ఉంది. అత్యధికంగా పామాయిల్, సన్ ఫ్లవర్ నూనెలనే వినియోగిస్తున్నారు. ఇతర రకాల ఆయిల్స్ 25 శాతమైతే మిగిలిన 75 శాతం పామాయిల్, సన్‌ఫ్లవర్ వినియోగమే. కొలెస్ట్రాల్ ఉండదు కాబట్టి ఈ ఆయిల్స్ వినియోగం బాగా విస్తరించింది. వేరుశెనగ కేవలం ఉప ఉత్పత్తులకు పరిమితమైంది.