బిజినెస్

పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 15: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్ ధరను 42 పైసలు, డీజిల్ ధరను 1.03 పైసలు చొప్పున పెంచుతూ చమురు మార్కెటింగ్ సంస్థలు ఆదివారం నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలు అర్ధరాత్రి నుంచే అమల్లోకి వస్తాయని ప్రకటించాయి. కాగా, అంతర్జాతీయ మార్కెట్‌లో పెరుగుతున్న ముడి చమురు ధరల నేపథ్యంలోనే పెంపు అనివార్యమైందని ఓ ప్రకటనలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఒసి) తెలిపింది. ఇకపోతే నవంబర్ నుంచి పెట్రోల్ ధరలు పెరగడం ఇది నాలుగోసారైతే, డిసెంబర్ నుంచి డీజిల్ ధర పెరగడం ఇది మూడోసారి. ప్రతీ పదిహేను రోజులకోసారి పెట్రోల్, డీజిల్ ధరలను చమురు మార్కెటింగ్ సంస్థలు సవరిస్తాయన్నది తెలిసిందే.