బిజినెస్

బడ్జెట్ అంచనాలు కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 15: త్రైమాసిక ఆర్థిక ఫలితాలు, ద్రవ్యోల్బణం గణాంకాలు, రాబోయే బడ్జెట్‌పై మదుపరుల అంచనాలు ఈ వారం దేశీయ స్టాక్ మార్కెట్లను నిర్దేశిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17) మూడో త్రైమాసికానికి (అక్టోబర్-డిసెంబర్) గాను రిలయన్స్ ఇండస్ట్రీస్, యాక్సిస్ బ్యాంక్, అదానీ పవర్ తదితర అగ్రశేణి సంస్థలు ఈ వారం తమ త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ప్రకటించనున్నాయ. దీంతో మదుపరులు తమ పెట్టుబడులపై వీటి ఆధారంగా నిర్ణయం తీసుకోవచ్చని మార్కెట్ వర్గాలు అంటున్నాయ. కాగా, గత నెల డిసెంబర్‌కుగాను టోకు ద్రవ్యోల్బణం గణాంకాలు సోమవారం విడుదలవుతున్నాయ. వీటి ప్రభావం కూడా ట్రేడింగ్‌పై కనిపించవచ్చని నిపుణులు చెబుతున్నారు. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ పబ్లిక్ ఇష్యూ 23న వస్తుండటంతో మదుపరులు దీనికోసం ఎంతో ఆసక్తిని ప్రదర్శిస్తున్నారని ట్రేడ్ స్మార్ట్ ఆన్‌లైన్ వ్యవస్థాపక డైరెక్టర్ విజయ్ సింఘానియా అన్నారు.
1,500 కోట్ల రూపాయల నిధుల సమీకరణే లక్ష్యంగా బిఎస్‌ఇ పబ్లిక్ ఇష్యూ వస్తోంది. ఇక పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో చోటుచేసుకుంటున్న పరిణామాలూ మార్కెట్ ట్రేడింగ్‌ను శాసించనున్నాయని మార్కెట్ విశే్లషకులు అంటున్నారు. నిన్నమొన్నటిదాకా కొత్త నోట్ల మార్పిడి వేగంగా జరగకపోవడం, ముఖ్యంగా 100 రూపాయల నోట్ల చెలామణి తగ్గి వ్యాపారాలు స్తంభించిపోవడం మదుపరులను కలవరపెట్టినది తెలిసిందే. అయతే నేడు కొత్త నోట్ల సరఫరా పెరగడం, ఎటిఎమ్‌లలో 2 వేల రూపాయల నోట్లతోపాటు 500 రూపాయల నోట్లూ వస్తుండటం మార్కెట్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. చిల్లర సమస్య తగ్గిపోవడంతో తిరిగి కొనుగోళ్లు పుంజుకుంటున్నాయ. దీంతో ఎఫ్‌ఎమ్‌సిజి, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ షేర్లు మదుపరులను ఆకర్షించవచ్చని మార్కెట్ విశే్లషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ విధానాలూ మదుపరుల పెట్టుబడులపై ప్రభావం చూపుతున్నాయ. ప్రధానంగా విదేశీ వ్యాపారంపైనే ఆధారపడ్డ భారతీయ ఐటి సంస్థలను అమెరికా హెచ్-1బి వీసాల వ్యవహారం ఆందోళనకు గురిచేస్తోంది. వీసాల జారీ అంశానికి సంబంధించి అమెరికా సర్కారు కొత్త మార్పులకు ప్రతిపాదిస్తుండటమే కారణం.
కాగా, ఎప్పట్లాగే డాలర్‌తో పోల్చితే రూపాయ మారకం విలువ, విదేశీ మదుపరుల పెట్టుబడులు, గ్లోబల్ స్టాక్ మార్కెట్ల కదలికలు, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు భారతీయ స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్‌ను ప్రభావితం చేయనున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. గత వారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 478.83 పాయింట్ల్లు పెరిగితే, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 156.55 పాయింట్లు కోలుకుంది. ఇదిలావుంటే ఈ ఏడాది చివరికల్లా సెనె్సక్స్ 29,000 పాయంట్లను అందుకోవచ్చని బ్యాంక్ ఆఫ్ అమెరికా మెర్రిల్ లించ్ అంచనా వేసింది.