బిజినెస్

ఉద్యోగుల పనితీరుపై సంస్థ విజయం ఆధారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 16: ఏ ప్రభుత్వరంగ సంస్థ విజయమైనా అందులో పనిచేసే ఉద్యోగుల పనితీరు, సమర్థతపై ఆధారపడి ఉంటుందని హైదరాబాద్‌లోని డాక్టర్ మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసిఆర్ హెచ్‌ఆర్‌డి ఇన్‌స్టిట్యూట్) డైరెక్టర్ జనరల్, ఎక్స్ అఫీషియో స్పెషల్ చీఫ్ సెక్రటరీ వినోద్ కె అగ్రవాల్ సోమవారం అన్నారు. సెంట్రల్ సెక్రటేరియేట్ సర్వీసులకు చెందిన అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ల (డైరెక్ట్ రిక్రూటీస్)కు నిర్వహించిన 11 వారాల శిక్షణ ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 80 మంది సిబ్బంది ఈ శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్నారు. అభ్యర్థులకు వినూత్న రీతిలో బహుముఖ విధానంలో శిక్షణ ఇచ్చారు. తరగతి గదులతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో పరిపాలన అంశాలపై పరిశీలన, పుస్తకాల రివ్యూ, కేస్ అనాలసిస్, సమాజ అభివృద్ధికి పాటుపడుతున్న స్వచ్ఛంద సేవా సంస్థల (ఎన్‌జిఓల) పనితీరుతెన్నులపై పరిశీలన, సైకోమెట్రిక్ టెస్టింగ్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ తదితర అంశాల్లో వీరికి శిక్షణ ఇచ్చారు. అభ్యర్థుల మేధస్సుకు పని కల్పించడంతో పాటు నైపుణ్య అభివృద్ధి, ప్రవర్తన తదితర అంశాల్లో శిక్షణ ఇచ్చారు. కింది స్థాయి ఉద్యోగులు సమర్థతగా పనిచేస్తేనే సంస్థ లక్ష్యాలు, ఉద్దేశాలు నెరవేరతాయని స్పష్టం చేశారు. కేవలం ఉద్యోగుల మేధస్సు, ఆలోచనలే కాకుండా, వారి సామాజిక, ఆధ్యాత్మిక అంశాలు కూడా సంస్థ అభివృద్ధికి దోహదపడతాయని వివరించారు. ఉద్యోగులు తమ శారీరక ధారుఢ్యాన్ని కూడా పెంచుకోవాలని సూచించారు. వివిధ కోణాల్లో ఉద్యోగుల అభివృద్ధి సంస్థ విజయానికి సహకరిస్తాయన్నారు. ఈ సమావేశంలో ఎంసిఆర్ హెచ్‌ఆర్‌డి అడిషనల్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ కె తిరుపతయ్య, జాయింట్ డైరెక్టర్ (శిక్షణ) కె గోవిందరాజులు, కోర్స్ సమన్వయకర్త కె అనిల్ కుమార్ తదితరులు కూడా మాట్లాడారు.