బిజినెస్

ఆకర్షించిన బ్యాంకింగ్ షేర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 16: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. బ్యాంకింగ్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 50.11 పాయింట్లు పెరిగి 27,288.17 వద్ద స్థిరపడితే, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 12.45 పాయింట్లు అందిపుచ్చుకుని 8,412.80 వద్ద నిలిచింది. సోమవారం ట్రేడింగ్‌లో సెనె్సక్స్ గరిష్ఠ స్థాయి 27,335.08 పాయింట్లవగా, కనిష్ట స్థాయి 27,172.68 పాయింట్లు. అలాగే నిఫ్టీ గరిష్ఠ స్థాయి 8,426.70 పాయింట్లయితే, కనిష్ట స్థాయి 8,374.40 పాయింట్లు. ప్రభుత్వరంగ బ్యాంకులకు మూలధన సాయంపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ నిర్ణయానికి వచ్చే వీలుందన్న వార్తలు బ్యాంకింగ్ షేర్ల కొనుగోళ్లకు దారితీశాయి. దీంతో బ్యాంకింగ్ షేర్ల విలువ 0.98 శాతం పెరిగింది. కాగా, రియల్టీ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, మెటల్, ఆటో రంగాల షేర్ల విలువలు కూడా 1.61 శాతం నుంచి 0.56 శాతం వరకు ఎగబాకాయి. అయితే ఆసియా మార్కెట్లలో చైనా, జపాన్, హాంకాంగ్ సూచీలు ఒక శాతం వరకు నష్టపోతే, ఐరోపా మార్కెట్లలోనూ ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ సూచీలు 0.75 మేర పడిపోయాయి. మరోవైపు బిఎస్‌ఇ అనుబంధ ఎక్స్‌చేంజ్ అయిన ఇండియా ఇంటర్నేషనల్ ఎక్స్‌చేంజ్ (ఇండియా ఐఎన్‌ఎక్స్) అధికారిక ట్రేడింగ్ సోమవారం మొదలైంది. గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ (గిఫ్ట్) సిటీ వద్ద ఇండియా ఐఎన్‌ఎక్స్ ఏర్పాటైనది తెలిసిందే. దీన్ని ఇటీవలే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు.