బిజినెస్

ఆర్‌ఐఎల్ లాభం రూ. 7,506 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 16: ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) మూడో త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో 7,506 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) అక్టోబర్-డిసెంబర్‌తో పోల్చితే ఇది 3.6 శాతం అధికం. నాడు 7,245 కోట్ల రూపాయల లాభాన్ని ఆర్‌ఐఎల్ అందుకుంది. ఈ మేరకు ఓ ప్రకటనలో సోమవారం సంస్థ తెలిపింది. ప్రపంచంలోనే అతిపెద్ద రిఫైనింగ్ కాంప్లెక్స్‌ను కలిగిన రిలయన్స్.. ప్రతీ బ్యారెల్ ముడి చమురు శుద్ధికి 10.8 డాలర్లను పొందింది. అయితే నిరుడు ఇది 11.5 డాలర్లుగా ఉంది. అయినప్పటికీ ఈసారి లాభం పెరగడం గమనార్హం. ఇక టర్నోవర్ విషయానికొస్తే ఈసారి 16.1 శాతం పెరిగి 84,189 కోట్ల రూపాయలుగా నమోదైంది. కాగా, రిలయన్స్ ఇండస్ట్రీస్ లాభాల్లో 36.5 శాతం నగదు నిల్వల ద్వారా వచ్చినదే కావడం విశేషం. రిలయన్స్ దగ్గరున్న భారీ నగదు నిల్వలపై వచ్చిన ఈ ఆదాయం 2,736 కోట్ల రూపాయలు. నిరుడు ఇదే సమయంలో ఇది 2,440 కోట్ల రూపాయలుగా ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్‌లో 2,393 కోట్ల రూపాయలుగా నిలిచింది. ఇకపోతే రిలయన్స్ ఇండస్ట్రీస్ సంచలన టెలికామ్ విభాగమైన జియో వినియోగదారులు డిసెంబర్ ఆఖరుకల్లా 72.4 మిలియన్లుగా నమోదయ్యారు. టెలికామ్ సేవలు ప్రారంభించి కేవలం నాలుగు నెలలే అవుతున్నా.. ఈ స్థాయిలో వినియోగదారులుండటంపట్ల రిలయన్స్ సంతోషం వ్యక్తం చేస్తోంది. కానీ ఇంటర్‌కనెక్ట్ సేవ లు మెరగుపడలేదని అసంతృప్తిని వెలిబుచ్చింది.