బిజినెస్

దేశ జిడిపి వృద్ధిరేటును తగ్గించిన ఐఎమ్‌ఎఫ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జనవరి 16: అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎమ్‌ఎఫ్).. సోమవారం భారత జిడిపి వృద్ధిరేటును తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17) 6.6 శాతంగానే నమోదు కావచ్చని అంచనా వేసింది. అంతకుముందు 7.6 శాతంగా ఉండొచ్చని పేర్కొనగా, పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో వృద్ధిరేటు పడిపోవచ్చని అభిప్రాయపడింది. ఇటీవల ప్రపంచ బ్యాంక్ సైతం దేశ జిడిపి వృద్ధిరేటును తగ్గించినది తెలిసిందే. 7.6 శాతం నుంచి 7 శాతానికి తగ్గించింది. కాగా, బ్యాంక్ ఆఫ్ అమెరికా, నొమురా, మోర్గాన్ స్టాన్లీ, ఫిచ్, క్రిసిల్, హెచ్‌ఎస్‌బిసి, సిటిగ్రూప్ వంటి గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీలే కాదు.. సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వ వర్గాలూ జిడిపి వృద్ధిరేటు తగ్గుతుందనే చెబుతున్నాయి. నోట్ల రద్దే కారణమని పేర్కొంటున్నాయ.
మరోవైపు అమెరికా వృద్ధిరేటు పెరగవచ్చని, నూతన దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలతో ఈ ఏడాది, వచ్చే ఏడాది అగ్రరాజ్య ఆర్థిక వ్యవస్థ పుంజుకోగలదని ఐఎమ్‌ఎఫ్ అంచనా వేసింది.