బిజినెస్

ఆంధ్రా బ్యాంక్ ఈ-వ్యాపార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 16: ప్రభుత్వరంగ బ్యాంకింగ్ సంస్థ ఆంధ్రా బ్యాంక్.. సోమవారం నగదు రహిత లావాదేవీల కోసం ఓ కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. మొబైల్ ఫోన్ల ద్వారా జరిగే ఈ లావాదేవీలకు ఆధార్ నెంబర్ ఉంటే చాలు. ‘డిజిటలైజేషన్‌లో భాగంగా మేము బ్యాంక్ ఖాతాదారులకు మరో సౌకర్యాన్ని అందిస్తున్నాం. సోమవారం నుంచే ఈ సదుపాయం అమల్లోకి వస్తుంది. అదే ఆంధ్రా బ్యాంక్ ఈ-వ్యాపార్’ అని బ్యాంక్ సిఎండి సురేశ్ ఎన్ పటేల్ ఇక్కడ జరిగిన కార్యక్రమంలో తెలిపారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌తోపాటు కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, మనోహర్ పారికర్, బండారు దత్తాత్రేయ కూడా హాజరయ్యారు. ఏ కార్డు, ఏ పిన్ నెంబర్ కూడా అవసరం లేకుండా కేవలం ఆధార్ నెంబర్‌తోనే నగదు రహిత లావాదేవీలకు అవకాశమిచ్చామని పటేల్ ఈ సందర్భంగా చెప్పారు. ఇప్పటిదాకా పాయింట్ ఆఫ్ సేల్ (పిఒఎస్) మెషీన్ల వద్ద కార్డులతో నగదు రహిత లావాదేవీలను జరిపారన్న ఆయన ఇకపై ఆ అవసరం లేకుండా మొబైల్ ద్వారానే ఆధార్ నెంబర్‌తో కొనుగోళ్లు జరపవచ్చన్నారు.

చిత్రం..ఆంధ్రా బ్యాంక్ ఈ-వ్యాపార్ సేవల గురించి అడిగి తెలుసుకుంటున్న ముఖ్యమంత్రి కెసిఆర్, కేంద్ర మంత్రులు దత్తాత్రేయ, చిత్రం..వెంకయ్య, పారికర్