బిజినెస్

పత్రికా రంగంలో ఎఫ్‌డిఐ పరిమితి పెంచే యోచన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 16: పత్రికా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డిఐ)కున్న పరిమితిని పెంచే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ప్రస్తుతం 26 శాతం ఎఫ్‌డిఐకి అనుమతి ఉండగా, దీన్ని 49 శాతానికి తీసుకెళ్ళాలని యోచిస్తోంది. దీనికి సంబంధించి కసరత్తును కూడా ప్రభుత్వం ప్రారంభించినట్లు తెలుస్తోంది. నిరుడు చాలా రంగాల్లో ఎఫ్‌డిఐ నిబంధనలను కేంద్రం సడలించినది తెలిసిందే. పౌర విమానయానం, రక్షణ, ప్రైవేట్ సెక్యురిటీ ఏజెన్సీలు, ఔషధ, ఆహార తయారీ రంగాల్లో ఎఫ్‌డిఐ పరిమితిని పెంచింది. గత ఆర్థిక సంవత్సరం (2015-16)లో దేశంలోకి వచ్చిన ఎఫ్‌డిఐ 40 బిలియన్ డాలర్లుగా ఉంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇది 31 బిలియన్ డాలర్లుగా నమోదైంది.