బిజినెస్

‘చిన్నతరహా గ్రానైట్ పరిశ్రమలను ప్రోత్సహించండి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 17: చిన్నతరహా గ్రానైట్ పరిశ్రమలకు సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహించాలని సత్తుపల్లి నియోజకవర్గం టిడిపి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ చిన్నత రహా గ్రానైట్ పరిశ్రమల సమాఖ్య ప్రతినిధుల బృందంతో కలిసి ఆయన మంగళవారం రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ను, గనులు, మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కె తారక రామారావును కలిసి ఈ మేరకు వినతి పత్రం అందజేశారు.
తెలంగాణలో ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో వందలాది చిన్నతరహా గ్రానైట్ పరిశ్రమలను నిరుద్యోగ యువకులు బ్యాంకుల ద్వారా రుణాలు పొంది నిర్వహిస్తున్నారని, తద్వారా వేలాది మందికి ఉపాధి లభిస్తున్నదని అన్నారు. గతంలో విద్యుత్ సమస్యలతో పరిశ్రమలు ఇబ్బంది పడేవని ఆయన తెలిపారు.
నిర్మాణ రంగం కుంటుపడి గ్రానైట్ పరిశ్రమ పరిస్థితి దిక్కుతోచని విధంగా తయారైందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అనేక పరిశ్రమలను బ్యాంకులు నిరర్థక ఆస్తులు (ఎన్‌పిఎ)గా ప్రకటించి వేలం వేస్తున్నాయని, మరికొన్ని పరిశ్రమలు మూతపడుతున్నాయని తెలిపారు. కాబట్టి గ్రానైట్ పరిశ్రమ దెబ్బతినకుండా వంద కోట్ల రూపాయల ప్యాకేజీని కేటాయించి పరిశ్రమను కాపాడాలని సండ్ర వెంకట వీరయ్య కోరారు. ప్రభుత్వం సాయమందిస్తే గ్రానైట్ పరిశ్రమ పరుగులు పెడుతుందని, నిరుద్యోగ యువతకు ఆర్థిక చేయూతనిచ్చినట్లవుతుందని పేర్కొ న్నారు. కాబట్టి వెంటనే ప్రభుత్వం ఈ దిశగా చర్యలు చేపట్టాలని, తద్వారా గ్రానైట్ పరిశ్రమపై ఆధారపడుతున్న అనేక కుటుంబాలను ఆదుకోవాలని ఈ సందర్భంగా సండ్ర వెంకట వీరయ్య విజ్ఞప్తి చేశారు.