బిజినెస్

ఫిన్‌టెక్ స్టార్టప్‌ల కోసం టి-హబ్‌తో యెస్ బ్యాంక్ దోస్తీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 17: తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేసిన స్టార్టప్ ఇంక్యుబేటర్ టి-హబ్‌తో ప్రముఖ ప్రైవేట్‌రంగ బ్యాంకింగ్ సంస్థ యెస్ బ్యాంక్ జట్టు కట్టింది. టి-హబ్ సహకారంతో ‘యెస్ ఫిన్‌టెక్’ అనే ఓ బిజినెస్ యాక్సలేటర్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమంలో అంకుర సంస్థల (స్టార్టప్) వృద్ధిని వేగవంతం చేసే వేదిక అయిన అంతిల్‌కూ భాగస్వామ్యం ఉంది. కాగా, ఫిన్‌టెక్ స్టార్టప్‌ల కోసం ప్రపంచవ్యాప్తంగా దరఖాస్తులను యెస్ ఫిన్‌టెక్ ఆహ్వానిస్తోంది. వెబ్‌సైట్లలో ఫిబ్రవరి 3 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అగ్రస్థానంలో నిలిచిన 12 స్టార్టప్‌లను ఎంపిక చేస్తామని ఓ ప్రకటనలో యెస్ బ్యాంక్ మంగళవారం తెలిపింది. తమ కార్పొరేట్ అవసరాల కోసం నూతన ఆర్థిక పరిష్కారాలను సూచించేలా దేశంలో 100కుపైగా టెక్ స్టార్టప్‌లకు యెస్ బ్యాంక్ చేయూతనిస్తోంది.