బిజినెస్

రూ. 3,500 కోట్లు సమీకరించిన ఎస్‌బిఐ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 17: ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) మంగళవారం ఓ అంతర్జాతీయ బాండ్ల విక్రయం ద్వారా 500 మిలియన్ డాలర్ల (దాదాపు 3,500 కోట్ల రూపాయలు) నిధులను సమీకరించింది. ఐదేళ్ల కాలపరిమితి కలిగిన ఈ బాండ్లకు విదేశీ మదుపరుల నుంచి విపరీతమైన స్పందన కనిపించింది. మూడు రెట్లు అధికంగా సబ్‌స్క్రైబ్ కావడం విశేషం.
కాగా, సింగపూర్ స్టాక్ ఎక్స్‌చేంజ్‌లో ఎస్‌బిఐ బాండ్ల ఆఫర్ లిస్టింగ్ అవనుంది. 10 బిలియన్ డాలర్ల మీడియం-టర్మ్ నోట్ల కార్యక్రమంలో భాగంగా ఈ బాండ్ల జారీకి దిగింది ఎస్‌బిఐ. ఇప్పటికే 3.5 బిలియన్ డాలర్ల నిధులను ఈ బాండ్ల జారీ ద్వారా ఎస్‌బిఐ అందుకుంది. నిరుడు సెప్టెంబర్‌తోపాటు, 2014 ఫిబ్రవరిలో డాలర్ డినామినేషన్ బాండ్లను ఎస్‌బిఐ విక్రయించింది. మళ్లీ ఇప్పుడు అదే డాలర్ డినామినేషన్‌లో బాండ్లను అమ్మగా, వీటికి ఏటా 3.25 శాతం ఫిక్స్‌డ్ ఇంట్రెస్ట్‌ను చెల్లించనుంది. 2022 జనవరి 24 నాటికి బాండ్ల కాలపరిమితి తీరుతుంది. బ్యాంక్ ఆఫ్ అమెరికా మెర్రిల్ లించ్, సిటీగ్రూప్, హెచ్‌ఎస్‌బిసి, బిఎన్‌పి పరిబాస్, డిబిఎస్ బ్యాంక్, ఎమ్‌యుఎఫ్‌జి, ఎస్‌బిఐ క్యాపిటల్ మార్కెట్లు ఈ బాండ్ల జారీని సంయుక్తంగా నిర్వహించాయి. బాండ్ల జారీకి లభించిన విశేష స్పందనపట్ల ఎస్‌బిఐ చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య ఆనందం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మదుపరుల నుంచి వ్యక్తమైన ఈ స్పందన అద్భుతమని, బ్యాంక్‌పట్ల వారికిగల విశ్వాసాన్ని నిలబెట్టుకుం టామని అన్నారు. తాజా స్పందన తమ 10 బిలియన్ డాలర్ల నిధుల సమీకరణ లక్ష్యాన్ని సులభం చేయగలదన్నారు.