బిజినెస్

మార్కెట్‌లోకి సరికొత్త సన్నీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జపాన్‌కు చెందిన ఆటోరంగ దిగ్గజం నిస్సాన్.. మంగళవారం భారతీయ మార్కెట్‌కు సరికొత్త సన్నీ కారును పరిచయం చేసింది. ఎక్స్‌షోరూం ఢిల్లీ ప్రకారం దీని కనిష్ట ధర 7.91 లక్షల రూపాయలుగా, గరిష్ఠ ధర 10.89 లక్షల రూపాయలుగా ఉంది. ఈ కొత్త వెర్షన్.. కస్టమర్లను మరింత ఆకట్టుకోగలదన్న ఆశాభావాన్ని ఈ సందర్భంగా నిస్సాన్ వ్యక్తం చేసింది. పెట్రోల్, డీజిల్ ఇంజిన్లతో వచ్చిన ఈ కారులో పెట్రోల్ వెర్షన్‌కైతే 1,498సిసి ఇంజిన్, డీజిల్ వెర్షన్‌కైతే 1,461సిసి ఇంజిన్ ఉంటాయి. పెట్రోల్ ఆధారిత మోడల్ కారు ధర 7.91 లక్షల రూపాయల నుంచి 10.89 లక్షల రూపాయల మధ్య ఉంది. డీజిల్ ఆధారిత మోడల్ కారు ధర 8.8 లక్షల రూపాయల నుంచి 10.76 లక్షల రూపాయల మధ్య ఉందని నిస్సాన్ మోటార్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ మల్హోత్రా ఓ ప్రకటనలో తెలిపారు.