బిజినెస్

శ్రీసిటీలో పర్యటించిన కేంద్ర ఉన్నతాధికారి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తడ, జనవరి 19: నెల్లూరు- చిత్తూరు జిల్లాల సరిహద్దుల్లో నెలకొల్పిన శ్రీసిటీ సెజ్‌ను గురువారం కేంద్ర ప్రభుత్వం కామర్స్,పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన ఇండస్ట్రియల్ పాలసీ ప్రమోషన్ విభాగం జాయింట్ సెక్రటరీ వందనకుమార్ సందర్శించారు. ఈమెకు ఎండి రవీంధ్ర సన్నారెడ్డి సాదర స్వాగతం పలికి శ్రీసిటీ పారిశ్రామికంగా సాధించిన అభివృద్ధి, ప్రగతి గురించి వివరించారు. అనంతరం ఆమె శ్రీసిటీలోని వివిధ ప్రాంతాలను సందర్శించారు. ఈ సందర్భంగా రవీంద్ర సన్నారెడ్డి మాట్లాడుతూ వందనకుమార్ సలహాలు తమకెంతో ఉపయోగ పడగలవని అన్నారు. శ్రీసిటీలాంటి అతి పెద్ద పారిశ్రామిక పార్కును నెలకొల్పి మేక్ ఇన్ ఇండియా పథకం వేగంగా పురోగమించడానికి అవసరమైన వౌలిక వసతులు నెలకొల్పి సమర్ధవంతంగా నిర్వహిస్తున్న రవి సన్నారెడ్డిని ఆమె అభినందించారు. పారిశ్రామికంగా శ్రీసిటీ శరవేగంగా అభివృద్ధి చెందుతున్నందుకు ఆమె సంతోషం వ్యక్తం చేశారు.
ఇస్రో శాస్తవ్రేత్తల బృందం రాక
ఇదిలావుండగా 45 మంది సభ్యులు గల ఇస్రో శాస్తవ్రేత్తల బృందం గురువారం శ్రీసిటీలో పర్యటించారు. వీరికి శ్రీసిటీ మార్కెటింగ్ అధికారులు స్వాగతం పలికి శ్రీసిటీలో నెలకొల్పిన ప్రపంచ స్థాయి పారిశ్రామిక వౌలిక వసతులు, వాటి ప్రత్యేకతలు, శ్రీసిటీలో స్థాపించిన వివిధ దేశ, విదేశ పరిశ్రమల గురించి వివరించారు. ఈ సందర్భంగా శ్రీసిటీలోని విఆర్‌వి, లాజా, పరిశ్రమలను వారు తిలకించారు. దేశంలోని వివిధ ఇస్రో కేంద్రాల్లో పనిచేస్తున్న శాస్తవ్రేత్తలను శ్రీహరికోటలో జరుగుతున్న ఒక ప్రత్యేక శిక్షణా సదస్సులోపాల్గొనున్నారని, శిక్షణలో భాగంగా శ్రీసిటీలో జరుగుతున్న పారిశ్రామికాభివృద్ధిని అధ్యయనం చేయడానికి శ్రీసిటీని సందర్శించామన్నారు. రాకెట్లలో వాడే ముఖ్య విభాగాల్లో పర్యటించిన తరువాత క్రయోజనిక్ ట్యాంకులను తయారు చేసి విఆర్‌వి కర్మాగారాన్ని సందర్శించి సాంకేతిక అంశాలపై అక్కడి నిపుణులతో చర్చించారు.